vamshi chand reddy
-
మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్
సాక్షి, మహబూబ్‌నగర్: పార్లమెంట్ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కోస్గి సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి తొలి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కోస్గి సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు వలస వచ్చిన కేసీఆర్‌ను గెలిపిస్తే ఇక్కడి ప్రజలను మోసగించారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ జిల్లాలో ఓట్లు అడగాలన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలో జరిగిన అన్యాయమే తెలంగాణకు ఎక్కువ. 27 వేల కోట్లు ఖర్చు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వని దద్దమ్మ కేసీఆర్. ...అభివృద్ధి ముసుగులో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు. సిగ్గులేకుండా యాత్రలు చేస్తేమని బీఆర్ఎస్ నేతలు చెపుతున్నారు. బీజేపీ,బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రధాని మోదీ జాతీయహోదా ఇస్తామని ఎందుకు ఇవ్వలేదో జిల్లా బీజేపీ నేతలు డీకే అరుణ,జితేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ జిల్లాలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదు. ...వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కొడంగల్‌లో 50 వేల మెజార్టీ ఇస్తే మరింత అభివృద్ధి చేస్తా. తెలంగాణలో 14 లోక్ సభ సీట్లు గెలిస్తేనే మన యుద్దం ముగిసినట్టు. కార్యకర్తలు ఆ దిశగా పనిచేయాలి. రాబోయే వారం రోజుల్లో 5 వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. వచ్చే నెల 15 వ తేదీలోపు రైతులందరికి రైతుబంద్ అందిస్తాం. రైతులను రుణవిముక్తి చేసేందుకు త్వరలో 2 లక్షల రుణమాపీ చేస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చల్లా వంశీచంద్ రెడ్డి 2014లో బీఆర్ఎస్ పార్టీ హవాని తట్టుకుని మరీ కల్వకుర్తి నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 మహబూబ్ నగర్ ఎంపీగా కూడా పోటీ చేసి వంశీచంద్ రెడ్డి ఓటమిపాలయ్యారు. తాజాగా రేవంత్‌రెడ్డి ప్రకటనతో వంశీచంద్‌రెడ్డి మరోసారి మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవనున్నారు. -
కేసీఆర్ మౌనం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు టీఎంసీల నీళ్ల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిన సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని తీసుకెళ్తుంటే మౌనంగా ఎందుకు ఉంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జూమ్ యాప్ ద్వారా శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తే తెలం గాణ 6 టీఎంసీ నీళ్లను నష్టపోతుందని చెప్పారు. 6 టీఎంసీల నీళ్లు తీసుకుపోయేందుకు జీవో జారీ చేసినా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రతిపాదన పూర్తయితే నాగార్జున సాగర్–పాలమూరు ఎత్తిపోతల–కల్వకుర్తి ప్రాజెక్టులకు చుక్క నీరు ఉండవని, దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ కోసం అక్కడి ప్రభుత్వం ఈనెల 11న టెండ ర్లు పిలుస్తున్నట్టు తెలుస్తోందని, ఆ ప్రక్రియ పూర్తి కావాలనే అపెక్స్ భేటీ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ కోరారని ఆరోపించారు. ఉత్తమ్ మోకాలికి గాయం: ఉత్తమ్‌కుమార్ రెడ్డి మోకాలికి గాయమైంది. ఇటీవల ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడ్డారని, దీంతో మోకాలికి బలమైన గాయం తగిలిందని గాంధీభవన్ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఆయన 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపాయి. శనివారం మాజీ ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి ఉత్తమ్‌ను కలిసి పరామర్శించారు. -
‘బస్తీ’మే సవాల్
సాక్షి, మహబూబ్‌నగర్: ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో కులగణన.. వార్డుల పునర్విభజన పూర్తయిన నేపథ్యంలో ఆయా పురాల్లో పాగా వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి అదనంగా కొత్తగా కొలువుదీరిన మరో తొమ్మిది మున్సిపాలిటీల పీఠాల కైవసం కోసం అన్ని పార్టీలు పావులు కదుపుతున్నారు. గత ఎన్నికలకు ఈసారి జరగనున్న ఎన్నికలకు పాత మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య పెరగడం.. అదనంగా కొత్తగా మరో తొమ్మిది మున్సిపాలిటీలు కొలువుదీరడం అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, బాదేపల్లి, నారాయణపేట, గద్వాల, అయిజ, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ పాత మున్సిపాలిటీలు ఉన్నాయి. గతేడాది ఆగస్టు 2న కొత్తగా ఏర్పడిన అమరచింత, పెబ్బేరు, కోస్గి, మక్తల్, అలంపూర్, వడ్డేపల్లి, కొత్తకోట, ఆత్మకూరు, భూత్పూర్ మున్సిపాలిటీలకు తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా అచ్చంపేట మున్సిపాలిటీకి 2016 మార్చి 6న ఎన్నికలు జరగగా.. ఆ పాలకవర్గం పదవీ కాలం 2021 మార్చి వరకు ఉంది. ఎదురులేని శక్తిగా టీఆర్ఎస్ గత ఆరు నెలల కాలంలో ఉమ్మడి జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో గెలుపు ధీమా నింపుతున్నాయి. అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ.. ప్రాదేశిక ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక స్ధానాలు కైవలం చేసుకుని ఎదురులేని శక్తిగా అవతరించింది. ఇదే స్పూర్తితో ‘పుర’ ఫలితాలు సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లందరూ అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పట్టణ ప్రజలూ మళ్లీ తమనే ఆశీర్వదిస్తారనే ధీమాతో నేతలున్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంతో పాటు పట్టణ సమస్యల పరిష్కారంలో చూపిన చొరవను ప్రధాన అజెండాగా చేసుకుని ప్రచారం చేయాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇదిలాఉండగా అధిష్టానం ఈసారి కొత్తగా ఏర్పడిన తొమ్మిది మున్సిపాలిటీల్లో గెలుపు బాధ్యతలు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకే అప్పగించింది. దీంతో వారు ఆయా పుర పీఠాల కైవసానికి యత్నాలు మొదలుపెట్టారు. ఉనికి కోసం కాంగ్రెస్ పాకులాట వరుస ఓటములతో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ కనీసం మున్సిపల్ ఎన్నికల్లోనైనా అత్యధిక స్ధానాలు గెలుచుకుని ఉనికి కాపాడుకునే యత్నం చేస్తోంది. వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడర్లో విశ్వాసం నింపడం ద్వారా పని చేసేవారికే టిక్కెట్టు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఆ మేరకు పార్టీని పట్టణాల్లో బలోపేతం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే సీనియర్లు పలువురు పార్టీని వీడి నాయకత్వలోపంతో ఉన్న ‘హస్తా’నికి చేయూతనిచ్చే వారు కరువయ్యారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్ధానం నుంచి పోటీ చేసిన మల్లు రవి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వంశీచంద్‌రెడ్డి మాత్రం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలూ చేపట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ శ్రేణులు పట్టణ ఓటర్లను మచ్చిక ఎలా చేసుకుంటారోననే చర్చ జరుగుతోంది. బీజేపీలో బలమైన క్యాడర్ లోక్‌సభ ఎన్నికల సమయంలో అప్పటి సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డి, డి.కె.అరుణలతో పాటు పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకోవడంతో బీజేపీ క్యాడర్లో గెలుపు ధీమా పెరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో కాస్త సత్తా చాటినా ప్రాదేశిక ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించని ఆ పార్టీ తమకు గ్రామాల కంటే పట్టణాల్లోనే బలమైన క్యాడర్ ఉందని భావిస్తోంది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీల్లో ఈసారి గెలుపు ఖాయమని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ గెలుపును ప్రభావితం చేసే అంశాలపై ఆ పార్టీ నేతలు దృష్టి సారించారు. ఇక ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసిన డి.కె.అరుణ తన సొంత ఇలాకా గద్వాల మున్సిపాలిటీలో ఎలాంటి చక్రం తిప్పుతారు? అక్కడ బలమైన శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ను ఎలా ఢీ కొంటారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. నాగర్‌కర్నూల్ పార్లమెంటు పరిధిలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఆ మున్సిపాలిటీల్లో కాషాయ పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుందో వేచిచూడాలి. -
దాని కోసమే పార్టీలు మారుతున్నారు: మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: దేశ చరిత్రలోనే ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది టీఆర్ఎస్ మాత్రమేనని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 8792 మంది టీఆర్టీ ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి కుటుంబాలు మనోవేదనకు గురు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దీనికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన వంశీ.. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మందికి పైగా నిరుద్యోగులు టీచర్ ఉద్యోగాల నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని గుర్తుచేశారు. రేపు జరిగే కేబినెట్ మీటింగ్‌లో అయినా, టీఆర్టీ ఉత్తీర్ణులైన నిరుద్యోగుల ఉద్యోగాల గురించి ప్రస్తావించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే 8792 మంది కుటుంబ సభ్యులతో సహా మరోసారి ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఎంతోమంది యువత తమ ప్రాణాలు అర్పించి తెలంగాణ సాధిస్తే, నేడు రాష్ట్రం ఏర్పడినా.. ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 15620 పోస్టులకు ఖాళీలు ఏర్పడితే.. ప్రభుత్వం కేవలం 7వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదని, వారి స్వలాభం కోసం ప్రకటనలు చేస్తూ పార్టీలు మారతున్నారని స్పష్టం చేశారు. -
‘బీజేపీ కార్యకర్తలే నాపై దాడి చేసింది’
హైదరాబాద్: జంగా రెడ్డిపల్లె పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించడానికి వెళ్లినప్పుడు బీజేపీ కార్యకర్తలే తనపై దాడికి ప్రయత్నించారని కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సాక్షి మీడియాతో మాట్లాడారు. తాను అక్కడి నుంచి వాహనంలో బయలుదేరినా రాళ్లతో దాడి చేశారని వెల్లడించారు. వాళ్లు విసిరిన రాళ్లు తగిలడంతో తాను తీవ్రంగా గాయపడ్డానని, దీంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందన్నారు. ఓటమి భయంతోనే బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కై దాడికి పాల్పడ్డారని చెప్పారు. జంగారెడ్డిపల్లె పోలింగ్ స్టేషన్ సెన్సిటివ్ ప్రాంతమని, తగిన భద్రత ఏర్పాటు చేయాలని తాను ముందే కోరినట్లు చెప్పారు. కానీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే తనపై దాడి జరిగిందన్నారు. ఆ సమయంలో భద్రతా వైఫల్యం కూడా తనకు స్పష్టంగా కనిపించిందని వివరించారు. తాను సానుభూతి కోసం పథకం రచిస్తే, బీజేపీ వాళ్లు ఎందుకు దాడి చేస్తారని సూటిగా ప్రశ్నించారు. ఏదిఏమైనా కల్వకుర్తి ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురు మదురు ఘటనలు మినహా మొత్తం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూలో ఉన్నవారికి ఓటేయడానికి అనుమతినిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో ఓటు వేయగా.. హైదరాబాద్ నగరంలో మాత్రం ఓటర్లు ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో నగరంలోని చాలా నియోజకవర్గాల్లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. చంద్రాయణగుట్ట, నాంపల్లి నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటింగ్‌పై అంతగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ బూత్‌లు బోసిపోయి కనిపించాయి. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తం కాగా.. ఈ నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై దాడి.. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం, జంగారెడ్డిపల్లిలో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి. గాయపడిన ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటనతో జంగారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా సకాలంలో స్పందించిన పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు చోటుచేసుకున్నా.. పోలీసులు అదుపు చేశారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ
సాక్షి, వెల్దండ: అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించి ఆశీర్వదించాలని పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి కోరారు. మండలంలోని లింగారెడ్డి, పోతేపల్లి గ్రామాలకు చెందిన మైనార్టీ నాయకులు మంగళవారం టీఆర్ఎస్ నుంచి వంశీచంద్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వంశీచంద్‌రెడ్డి నాయకులకు కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ ద్వారా వివిధ అపరేషన్లు, విద్యార్థులకు పీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాలను అందజేసినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి భారీమెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ మైనార్టీ మండల అధ్యక్షుడు రషీద్, నాయకులు శ్రీనివాస్‌ముదిరాజ్, వెంకటయ్యగౌడు తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ సమగ్రాభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి, చంద్రాయణపల్లితండా, ముర్తుజపల్లి, ఆమనగల్లులో మంగళవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వంశీచంద్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించిన ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలతో మోసం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ధనుంజయ, వర్కింగ్ ప్రెసిడెంట్ మండ్లి రాములు, మా జీ ఎంపీటీసీ సభ్యుడు కాయితి చెన్నారెడ్డి, మాజీ సర్పంచ్ పర్వతాలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎండపల్లి నారాయణ, నాయకులు ఖలీల్, ఖాదర్, వస్పుల మానయ్య, జంతుక యాదయ్య, కృష్ణానాయక్, వస్పుల శ్రీశైలం, సురేశ్‌నాయక్, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌నాయక్, నర్సింహారెడ్డి, ఖాదర్, కిషన్ నాయక్, ఫిరోజ్, శ్రీకాంత్, రాఘవేందర్, అలీం, టీడీపీ నాయకులు గాజుల శ్రీనివాస్, కాలె మల్లయ్య, వెంకటేశ్‌లు పాల్గొన్నారు. కల్వకుర్తి రూరల్: మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మండలంలోని మార్చాల, తర్నికల్, ఎల్లికల్ గ్రామాల్లో ప్రజా కూటమి నాయకులు ప్రచారం కొనసాగించారు. కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. వంశీచంద్‌రెడ్డి తండ్రి రాంరెడ్డి మార్చాలలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. -
నిరుపేదల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం
సాక్షి, ఆమనగల్లు: నిరుపేద ప్రజల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి చ ల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మహాకూట మి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తలకొండపల్లి మండలంలోని గట్టుప్పలపల్లి, వెంకట్రావ్పేట, మెదక్‌పల్లి, రాంపూర్, జంగారెడ్డిపల్లి గ్రామాల్లో గురువారం వంశీచంద్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్లు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి వాటిని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. అదే విధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్లకు బుద్ధిచెప్పాలని ఆయన కోరారు. ప్రజాసంక్షేమం కోసం కాంగ్రెస్‌ను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, అంజయ్యగుప్త, కండె ఓంకారం, వెంకటమ్మ, అజీం, శ్యాంసుందర్‌రెడ్డి, లింగం, రవీందర్, నరేశ్, మహేశ్, ఎంపీటీసీ రాములు, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. చల్లా అశ్లేషారెడ్డి ఇంటింటి ప్రచారం.. ఆమనగల్లు పట్టణంలో గురువారం కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా ఆయన సతీమ ణి అశ్లేషారెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో వం శీచంద్రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు. ప్రజల కు అందుబాటులో ఉండి పనిచేస్తారని, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తారని ఆమె వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మండ్లి రాములు, నాయకులు ఖలీల్, ఖాదర్, వస్పుల మానయ్య, జంతుక యాదయ్య, కృష్ణా నాయక్, సురేశ్‌నాయక్, కరీం, వస్పుల శ్రీశైలం, గోపాల్, హరిలాల్, కిషన్‌నాయక్ పాల్గొన్నారు. -
కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొడితే లక్ష ఉద్యోగాలు వస్తాయి..
సాక్షి, వంగూరు: త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ కోరారు. ఆదివారం మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. తుమ్మలపల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా తాను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామానికి అవసరమైన బీటీ రోడ్లు, అంతర్గత రోడ్లను సీసీరోడ్లుగా మార్చడంతోపాటు ప్రజలకు అవసరమైన ఇళ్లు, పింఛన్లు, సిలిండర్లు అందించామన్నారు. అలాగే స్కూల్ బిల్డింగ్లు, వాటర్‌ట్యాంక్‌తోపాటు అనేక అభివృద్ధి పనులు చేసిన తనకు ఓట్లు వేయాల్సిన బాధ్యత తుమ్మలపల్లి గ్రామస్తులపై ఉందని ఆయన అన్నారు. అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేయనుందని వంశీకృష్ణ తెలిపారు. రెండులక్షల రుణమాఫీ, వ్యక్తిగత ఇళ్ల నిర్మాణానికి రూ.ఐదు లక్షలు, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు అదనపు గదికోసం రూ.2లక్షల నగదు, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల నియామకం లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమై ఎన్నికల మేనిఫెస్టో ముందుకు తెచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొడితే రాష్ట్రంలోని లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ అనూరాధ, పార్టీ మండల అధ్యక్షుడు మల్లయ్యయాదవ్, పార్టీ నాయకులు అల్వాల్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, సత్యనారాయణ, విష్ణువర్ధన్‌రెడ్డి, శంకర్, బాలస్వామిగౌడ్, యాదగిరిరావు, మదన్‌కుమార్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు నారాయణరెడ్డి, రమేష్‌గౌడ్, షేర్‌ఖాన్, మల్లేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిక... మండలంలోని తుమ్మలపల్లి, రంగాపూర్, పోతారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన పలువురు టీడీపీ, టీఆర్ఎస్కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. -
'ఇంతటి అజ్ఞాని మంత్రిగా ఉండటం దురదృష్టం'
హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలకు అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీ ప్రాంగణంలో బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు చేస్తే మంత్రి తోక ముడిచారని, సవాలు స్వీకరించలేక తన అనుచరులతో మాట్లాడించారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 62 వేల ఎకరాల నుంచి 37 వేల ఎకరాలకు కుదించారని, ఈ ప్రాజెక్టు విస్తీర్ణం తగ్గించారని తాను అంటుంటే తగ్గించలేదని జూపల్లి అంటున్నారని, జీవోలో మార్పులు చేసి చేయలేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఇంతటి అజ్ఞాని మంత్రిగా ఉండటం జిల్లా చేసుకున్న దురదృష్టమన్నారు. ఆయనకు మంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. డిండికి నీళ్లు తీసుకుపోవడానికి తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. డిండికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకుపోవద్దని సీఎంకు లేఖ రాసింది జూపల్లి కాదా.. డిండికి నీళ్లు తీసుకుపోతున్నా ఎందుకు సైలెంటుగా ఉంటున్నారని ప్రశ్నించారు. కల్వకుర్తి కాలువలు, టన్నెల్ సైజులు తగ్గించడంలో జూపల్లి పాత్ర ఉందని, ఈ వ్యవహారంలో కోట్లు దండుకున్నది జూపల్లి కాదా అని నిలదీశారు. తాను అడిగిన ప్రశ్నలకు మంత్రి జూపల్లి సమాధానం చెప్పకపోతే మంత్రి పదవికి రాజీనామా చేసి పాలమూరు జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వంశీచంద్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
'పాలమూరుకు తొలి శత్రువు ఆయనే'
హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరుకు తొలి శత్రువు మంత్రి జూపల్లి అని అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. డిండి ప్రాజెక్ట్‌కు నీళ్లు తీసుకుపోవడానికి మేము వ్యతిరేకం కాదు.. పాలమూరు, రంగారెడ్డికి అనుసంధానం కాకుండా డిండికి నీళ్లు తీసుకుపోవాలి.. జీఓను మార్చలేదని చెప్పిన జూపల్లి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. నా తప్పు ఉంటే ముక్కు నేలకు రాస్తా.. లేకపోతే జూపల్లి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు. -
‘ఇక ప్రభుత్వంపై ప్రజాయుద్ధమే’
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నీటిని ఇతర ప్రాజెక్టులకు మళ్లించే ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటుచేసి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి తగ్గట్టుగా నిర్ణయం మార్చుకోవాలని కోరారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో భాగంగా డీ-82లో తొలగించిన 35వేల ఎకరాల ఆయకట్టు పునరుద్దణ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. లేదంటే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వానికి ప్రజల తరపున ఇదే తన అల్టిమేటం అని తెలిపారు. ఈనెల 18వ తేదీన వేలాది మంది రైతులతో ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. 18 తర్వాత ఇక ప్రభుత్వంపై ప్రజా యుద్ధమేనన్నారు. ప్రజలు గెలుస్తారో, పదవులకోసం పాకులాడే నాయకులు గెలుస్తారో తేల్చుకుందామని వ్యాఖ్యానించారు. రైతులు గెలుస్తారో, కాంట్రాక్టర్లతో రాజీపడే రాబందులు గెలుస్తారో తేల్చుకుందామని ప్రభుత్వానికి వంశీచంద్ రెడ్డి సవాల్ విసిరారు. -
ప్రతిపక్షాల గొంతు నొక్కింది..
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కిందని ఆరోపించారు. అతి తక్కువగా కేవలం 13 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదనడానికి నిదర్శనమని విమర్శించారు. అసెంబ్లీలో ప్రభుత్వం గెలవడానికి అన్ని వర్గాల ప్రజలను ఓడించిందని చెప్పారు. సబ్ ప్లాన్‌ను, స్పెషల్ డెవలప్మెంట్ బిల్లుపై సమగ్ర చర్చ జరగకుండా ప్రభుత్వం దాటవేసిందని చెప్పారు. -
సాగునీటి సమీక్షలా? టీఆర్ఎస్ సమావేశాలా?
హైదరాబాద్: నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చేపడుతున్న సాగునీటి సమీక్షలు టీఆర్ఎస్ సమావేశాలుగా మారయని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి విమర్శించారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న అవనీతి, అవకతవకలపై ప్రశ్నిస్తామనే భయంతో ప్రతిపక్ష సభ్యులకు ఆహ్వానాలు పంపడం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు సైట్ల వద్ద బహిరంగ చర్చకు సిద్ధంకండి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ప్రాజెక్టు సైట్ ల వద్దే బహిరంగ చర్చలు నిర్వహించింది. సీఎం దృష్టిలో అందరినీ కలుపుకొని పోవడం అంటే విపక్ష సభ్యులను టీఆర్ఎస్ లో చేర్చుకోవడమా అని ప్రశ్నించారు. -
ఆ డిజైన్ వల్ల కల్వకుర్తికి నష్టం: వంశీచంద్ రెడ్డి
కల్వకుర్తి(నాగర్ కర్నూలు జిల్లా): కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి పంప్ హౌస్‌కు 300 మీటర్ల దగ్గర్లోనే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌ను డిజైన్ చేయడం వల్ల కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ దెబ్బ తింటుందని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని నిపుణులు కమిటీ కూడా తేల్చిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిజైన్ మార్పుకి క్యాబినెట్ ఆమోదం తెలిపడం అన్యాయమని మండిపడ్డారు. కేబినెట్లో ఉన్న జిల్లా మంత్రి జూపల్లి కృష్ణా రావు ప్రజలకు నష్టం జరుగుతున్నా మాట్లాడకపోవడం దారుణమని వంశీచంద్ అన్నారు. జూపల్లి రైతు వ్యతిరేకి అని విమర్శించారు. మంత్రి జూపల్లి వెంటనే రాజీనామా చేసి, నాగర్ కర్నూల్ ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి సవాల్‌ని స్వీకరిస్తున్నానని..రేపు ఉదయం 11 గంటలకు కల్వకుర్తి లోని అంబేడ్కర్ విగ్రహం దగ్గరకి రావాలని కోరారు. -
విష్ణు వర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు
హైదరాబాద్:మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టులోవాదోపవాదాలు పూర్తయిన అనంతరం విష్ణు వర్ధన్ కు బెయిల్ లభించింది. ఈ రోజు ఉదయం విష్ణు బెయిల్ కు సంబంధించి వాదనలు జరిగినా.. న్యాయమూర్తి తన నిర్ణయాన్నిమధ్యాహ్నానికి వాయిదా వేశారు. కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిపై విష్ణు, మరికొందరు దాడి చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ ను అడ్డుకునే యత్నం చేశారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విష్ణుకు బెయిల్ మంజూరు చేసింది. -
విష్ణు బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టులోవాదోపవాదాలు శుక్రవారం పూర్తయ్యాయి. న్యాయమూర్తి తన నిర్ణయాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిపై విష్ణు, మరికొందరు దాడి చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అందువల్ల ఆయనకు ముందస్తు బెయిల్ ముంజూరు చేయవద్దని కోరారు. అయితే విష్ణు బెయిల్ కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. -
జాప్యం జరిగింది... వాస్తవమే: జగదీష్‌రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలు అన్నింటికీ సరైన సమయంలోనే పాఠ్యపుస్తకాలు అందజేశామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు జగదీష్ రెడ్డి సమాధానమిస్తూ... సామాజిక శాస్త్రం పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నాయని చెప్పారు. అధిక ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని జగదీష్‌రెడ్డి సభకు హామీ ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సభలో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో పుస్తకాల అమ్మకాలు తగ్గుతున్నాయని ఆందోళన చెందారు. పుస్తకాలు ధర మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయని... ఈ నేపథ్యంలో పేద విద్యార్థులపై పుస్తకాల కొనుగోళ్లలో అధిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులకు ఇంతవరకు పుస్తకాలు అందలేదన్నారు. నకిలీ పుస్తకాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించాలని వంశీచంద్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై విధంగా సమాధాన మిచ్చారు. -
కేసీఆర్... సెంటిమెంట్ రాజకీయాలు మానుకో
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులపై టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. కరెంట్ కావాలని కోరిన రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం దారుణమని అన్నారు. రైతులకు నిరంతరాయంగా ఏడు గంటల పాటు కరెంట్ అందిస్తామని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో హమీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ హమీని టీఆర్ఎస్ పార్టీ గాలికి వదిలేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి రెండు గంటలు కరెంట్ కూడా అందడం లేదని... రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందజేయాలని వంశీచంద్ర టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలో 80 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనపై ఒక్క రైతు కూడా రోడ్డు ఎక్కలేదని వంశీచంద్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇకనైనా సెంటిమెంట్ రాజకీయాలు మానుకుని రాష్ట్రంలోని సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే వంశీచంద్ హితవు పలికారు. -
టీఆర్ఎస్కు సహకారం అందిస్తాం: వంశీచంద్
ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలు విశ్వసించారని... అందుకే ఆ పార్టీకి ఓటేశారని కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీచంద్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో అన్నారు. అదికాక తెలంగాణ ప్రజలు మార్పుకోరుకుని టీఆర్ఎస్ను గెలిపించారన్నారు. అలాగే 10 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉండి వచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి తమ వంతు సహకారం అందిస్తామని వంశీచంద్ స్పష్టం చేశారు. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఓడినందుకు కాంగ్రెస్ పార్టీ బాధపడాల్సిన అవసరం లేదని వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. -
కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ గెలుపు
-
ఓటుకో రేటు!
కల్వకుర్తి అసెంబ్లీ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్న జూపల్లి గ్రామంలో ఓటుకో రేటు పలుకుతోంది. ఆయా పార్టీలు ప్రలోభాలపర్వానికి తెరతీశాయి. గ్రామానికి బయటి వ్యక్తులను అనుమతించకపోవడంతో అంతా సెల్ఫోన్లోనే ప్రచారం సాగుతోంది. ఓటువేసి గెలిపించాల్సిందిగా ఓటర్ల బంధుగణం, సంబంధీకుల ద్వారా అభ్యర్థిస్తున్నారు. ఓటుకు రూ.10 వేల నుంచి రూ.15వేలు చొప్పున, ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే రూ.40వేలు ఇస్తున్నారు. ఫోన్ల ద్వారా శివారు ప్రాంతంలోని వ్యవసాయ పొలాలు, దాబాలు, మామిడితోటల వద్దకు ఓటర్లను పిలుపించుకుని ఎరవేస్తున్నారు..అడిగినంతా ఇచ్చేస్తున్నారు. వెల్దండ/కల్వకుర్తి, న్యూస్‌లైన్: కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి ఫలితం వెల్లడించే సమయంలో జూపల్లి 119 పోలింగ్‌బూత్‌లో ఈవీఎం మొరాయించిన విషయం విధితమే. విజ యం కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రె డ్డి, బీజేపీ అభ్యర్థి టి.ఆచారి మధ్యే దో బూచులాడింది. లెక్కింపు సందర్భంగా ఈవీఎంలో సాంకేతికలోపం తలెత్తడంతో అధికారులు ఫలితాన్ని నిలిపేశారు. ఈ నే పథ్యంలో ఈ బూత్‌పరిధిలో రీపోలింగ్ అనివార్యమైంది. ఈసీ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సోమవారం ఎన్నిక ప్ర క్రియ నిర్వహిస్తున్నారు. జూపల్లి 9వ వా ర్డు, జేపల్లి, దొడ్లపల్లి, దొంగలగట్టుతం డా, నెమలిగుట్టతండాల పరిధిలో 867 ఓ ట్లు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నియోజకవర్గంలో రీపోలింగ్ ని ర్వహించున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల తరుఫున బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తీవ్రఅలజడి నెలకొంది. గెలుపోటముల్లో స్వల్పతేడా ఉండటంతో ఎన్ని ఇబ్బం దులు తలెత్తినా చివరివరకు ప్రయత్నించి గెలుపే లక్ష్యంగా ముందుకుసాగాలని కా ర్యకర్తలకు సూచించారు. దీంతో గతరెం డు రోజులుగా పగలు, రాత్రి అనే తేగా లేకుండా ఆ రెండు పార్టీల నాయకులు జూపల్లి గ్రామం, తండాలు అనే తేడా లేకుండా పొలాల్లో పాగావేసి, తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని కోరుతున్నారు. పోలీసు పహారాలో జూపల్లి రీ పోలింగ్ నేపథ్యంలో జూపల్లి పూర్తిగా పోలీసు పహారాలో ఉంది. ఓటర్కో పోలీసు చొప్పున బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్, షాద్‌నగర్ డీఎస్పీ ద్రోణాచార్యులు, జేసీ ఎల్. శర్మణ్, ఆర్డీఓ హన్మంతరావు సంద ర్శించారు. ఓటర్లకు స్లిప్పుల పంపిణీని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పోలీసులను ఆదేశించారు. ఇక పోలీసులు గ్రామశివారులో తనిఖీలు నిర్వహిస్తుండగా.. రూ.8లక్షలు పట్టుబడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆపిఉంచిన ఓ వాహనం నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. -
మొరాయించిన ఈవీఎం.. ఎల్లుండి రీ పోలింగ్ కు ఈసీ ఆదేశం
మహబూబ్ నగర్: జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోజూపల్లి 119 పోలింగ్ బూత్ లో సోమవారం రీ పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. నిన్నటి నుంచి ఈవీఎం మొరాయించడంతో ఆ ఫలితాన్ని అధికారులు పెండింగ్ లో పెట్టారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఒక నివేదికను ఈసీకి అందజేశారు. దీంతో జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తేలడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తీవ్రంగా శ్రమించిన అధికారులు తిరిగి ఈ రోజు ఈవీఎంను ఓపెన్ చేయడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఓపెన్ చేయడానికి ఈసీఎల్ ఇంజినీర్లు రంగంలోకి దిగినా.. చివరకు వారు చేతులెత్తేశారు. ఈవీఎంను ఓపెన్ చేయడం తమవల్ల కాదంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు తేల్చిచెప్పేశారు. దీంతో ఇక్కడ తాజాగా ఎన్నిక నిర్వహించాలని భన్వర్ లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేశారు. ఈ బూత్ లో రీ పోలింగ్ నిర్వహించాలంటూ సిఫారుసు చేశారు. కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన వంశీచంద్‌రెడ్డికి తన సమీప ప్రత్యర్థి అచారిపై167 ఓట్లు ఆధిక్యంగా పోలైయ్యాయి. ఆ దశలో ఈవీఎం మొరాయించింది. దాంతో ఎన్నికల అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. అనంతరం ఈవీఎం మొరాయించిందని ఎన్నికల అధికారులు ఈసీ ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ ఈవీఎంను ఓపెన్ చేయడం కష్టసాధ్యంగా మారడంతో తిరిగి ఈ బూత్ కు సంబంధించి ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత వైఎస్సార్ సీపీ నేత భూమా శోభానాగిరెడ్డి విజయంపై కూడా ఈసీకి భన్వర్ లాల్ నివేదిక అందజేశారు. -
ఈవీఎం మొరాయింపుపై ఈసీకి భన్వర్ లాల్ నివేదిక
మహబూబ్ నగర్: జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తేలడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి నుంచి కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో జూపల్లి 119 బూత్ లోని ఈవీఎం మొరాయించడంతో ఆ ఫలితాన్ని అధికారులు పెండింగ్ లో పెట్టారు. ఇప్పటికే తీవ్రంగా శ్రమించిన అధికారులు తిరిగి ఆ ఈవీఎంను ఓపెన్ చేయడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఓపెన్ చేయడానికి ఈసీఎల్ ఇంజినీర్లు రంగంలోకి దిగినా.. చివరకు వారు చేతులెత్తేశారు. ఈవీఎంను ఓపెన్ చేయడం తమవల్ల కాదంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు తేల్చిచెప్పేశారు. దీంతో ఇక్కడ తాజాగా ఎన్నిక నిర్వహించాలని భన్వర్ లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేశారు. ఈ బూత్ లో రీ పోలింగ్ నిర్వహించాలంటూ సిఫారుసు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన వంశీచంద్‌రెడ్డికి తన సమీప ప్రత్యర్థి అచారిపై167 ఓట్లు ఆధిక్యంగా పోలైయ్యాయి. ఆ దశలో ఈవీఎం మొరాయించింది. దాంతో ఎన్నికల అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. అనంతరం ఈవీఎం మొరాయించిందని ఎన్నికల అధికారులు ఈసీ ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ ఈవీఎంను ఓపెన్ చేయడం కష్టసాధ్యంగా మారడంతో తిరిగి ఈ బూత్ కు సంబంధించి ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత వైఎస్సార్ సీపీ నేత భూమా శోభానాగిరెడ్డి విజయంపై కూడా ఈసీకి భన్వర్ లాల్ నివేదిక అందజేశారు. -
కల్వకుర్తిలో ఇవిఎమ్ కొత్త పంచాయతీ
-
ఉత్కంఠలో కల్వకుర్తి అసెంబ్లీ ఫలితం
మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన వంశీచంద్‌రెడ్డికి తన సమీప ప్రత్యర్థి అచారిపై167 ఓట్లు ఆధిక్యంగా పోలైయ్యాయి. ఆ దశలో ఈవీఎం మొరాయించింది. దాంతో ఎన్నికల అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. ఈవీఎంను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. అనంతరం ఈవీఎం మొరాయించిందని ఎన్నికల అధికారులు ఈసీ ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. Techical problam in evm -
'అధికారం కోసం కాంగ్రెస్ ఆరాటపడలేదు'
హైదరాబాద్ : అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఆరాటపడిన దాఖలాలు లేవని యూత్ కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారమిక్కడ ఏ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగింది, త్వరలోనే తదుపరి చర్యలు ప్రారంభం అవుతాయన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని వంశీచంద్ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగానే రాష్ట్ర విభజన జరుగుతుందన్నారు. ఇదే కార్యక్రమంలో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా ఓ స్పష్టత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి చవిచూడనున్న కాంగ్రెస్ కఠిన నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఆంటోనీ కమిటీని వేసిందని ప్రభాకర్ విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజన యూపీఏ సమిష్టి నిర్ణయమన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం పెట్టుబడిదారుల ఉద్యమని ఆయన ఆరోపించారు. ఏపీఎన్జీవోలను కొంతమంది పెట్టుబడిదారులు పోషిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకే కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రాజయ్య అన్నారు.