నిరుపేదల అభివృద్ధే కాంగ్రెస్‌ లక్ష్యం | Congress aims to decrease poverty | Sakshi
Sakshi News home page

నిరుపేదల అభివృద్ధే కాంగ్రెస్‌ లక్ష్యం

Nov 23 2018 1:16 PM | Updated on Mar 6 2019 6:03 PM

Congress aims to decrease poverty - Sakshi

తలకొండపల్లి మండలం వెంకట్రావ్‌పేటలో ప్రచారంలో పాల్గొన్న చల్లా వంశీచంద్‌రెడ్డి

సాక్షి, ఆమనగల్లు: నిరుపేద ప్రజల అభివృద్ధే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి చ ల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మహాకూట మి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తలకొండపల్లి మండలంలోని గట్టుప్పలపల్లి, వెంకట్రావ్‌పేట, మెదక్‌పల్లి, రాంపూర్, జంగారెడ్డిపల్లి గ్రామాల్లో గురువారం వంశీచంద్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి వాటిని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. అదే విధంగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు బుద్ధిచెప్పాలని ఆయన కోరారు.

ప్రజాసంక్షేమం కోసం కాంగ్రెస్‌ను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, అంజయ్యగుప్త, కండె ఓంకారం, వెంకటమ్మ,  అజీం, శ్యాంసుందర్‌రెడ్డి, లింగం, రవీందర్, నరేశ్, మహేశ్, ఎంపీటీసీ రాములు, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.  


చల్లా అశ్లేషారెడ్డి ఇంటింటి ప్రచారం.. 
ఆమనగల్లు పట్టణంలో గురువారం కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా ఆయన సతీమ ణి అశ్లేషారెడ్డి స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో వం శీచంద్‌రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు. ప్రజల కు అందుబాటులో ఉండి పనిచేస్తారని, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తారని ఆమె వివరించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మండ్లి రాములు, నాయకులు ఖలీల్, ఖాదర్, వస్పుల మానయ్య, జంతుక యాదయ్య, కృష్ణా నాయక్, సురేశ్‌నాయక్, కరీం, వస్పుల శ్రీశైలం, గోపాల్, హరిలాల్, కిషన్‌నాయక్‌ పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement