వెల్దండ: కాంగ్రెస్‌లో చేరుతున్న లింగారెడ్డిపల్లి నాయకులు
సాక్షి, వెల్దండ: అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించి ఆశీర్వదించాలని పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి కోరారు. మండలంలోని లింగారెడ్డి, పోతేపల్లి గ్రామాలకు చెందిన మైనార్టీ నాయకులు మంగళవారం టీఆర్‌ఎస్ నుంచి వంశీచంద్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వంశీచంద్‌రెడ్డి నాయకులకు కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ ద్వారా వివిధ అపరేషన్లు, విద్యార్థులకు పీజు రీయింబర్స్‌మెంట్ తదితర పథకాలను అందజేసినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి భారీమెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ మైనార్టీ మండల అధ్యక్షుడు రషీద్, నాయకులు శ్రీనివాస్‌ముదిరాజ్, వెంకటయ్యగౌడు తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ సమగ్రాభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి, చంద్రాయణపల్లితండా, ముర్తుజపల్లి, ఆమనగల్లులో మంగళవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వంశీచంద్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించిన ప్రజలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాయమాటలతో మోసం చేసిందని ఆరోపించారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ధనుంజయ, వర్కింగ్ ప్రెసిడెంట్ మండ్లి రాములు, మా జీ ఎంపీటీసీ సభ్యుడు కాయితి చెన్నారెడ్డి, మాజీ సర్పంచ్ పర్వతాలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎండపల్లి నారాయణ, నాయకులు ఖలీల్, ఖాదర్, వస్పుల మానయ్య, జంతుక యాదయ్య, కృష్ణానాయక్, వస్పుల శ్రీశైలం, సురేశ్‌నాయక్, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌నాయక్, నర్సింహారెడ్డి, ఖాదర్, కిషన్ నాయక్, ఫిరోజ్, శ్రీకాంత్, రాఘవేందర్, అలీం, టీడీపీ నాయకులు గాజుల శ్రీనివాస్, కాలె మల్లయ్య, వెంకటేశ్‌లు పాల్గొన్నారు.
కల్వకుర్తి రూరల్: మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మండలంలోని మార్చాల, తర్నికల్, ఎల్లికల్ గ్రామాల్లో ప్రజా కూటమి నాయకులు ప్రచారం కొనసాగించారు. కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. వంశీచంద్‌రెడ్డి తండ్రి రాంరెడ్డి మార్చాలలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment