మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన వంశీచంద్రెడ్డికి తన సమీప ప్రత్యర్థి అచారిపై167 ఓట్లు ఆధిక్యంగా పోలైయ్యాయి. ఆ దశలో ఈవీఎం మొరాయించింది.
దాంతో ఎన్నికల అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. ఈవీఎంను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. అనంతరం ఈవీఎం మొరాయించిందని ఎన్నికల అధికారులు ఈసీ ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
Techical problam in evm