కల్వకుర్తి(నాగర్ కర్నూలు జిల్లా): కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి పంప్ హౌస్‌కు 300 మీటర్ల దగ్గర్లోనే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌ను డిజైన్ చేయడం వల్ల కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ దెబ్బ తింటుందని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని నిపుణులు కమిటీ కూడా తేల్చిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిజైన్ మార్పుకి క్యాబినెట్ ఆమోదం తెలిపడం అన్యాయమని మండిపడ్డారు.
కేబినెట్లో ఉన్న జిల్లా మంత్రి జూపల్లి కృష్ణా రావు ప్రజలకు నష్టం జరుగుతున్నా మాట్లాడకపోవడం దారుణమని వంశీచంద్ అన్నారు. జూపల్లి రైతు వ్యతిరేకి అని విమర్శించారు. మంత్రి జూపల్లి వెంటనే రాజీనామా చేసి, నాగర్ కర్నూల్ ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తున్నానని..రేపు ఉదయం 11 గంటలకు కల్వకుర్తి లోని అంబేడ్కర్ విగ్రహం దగ్గరకి రావాలని కోరారు.
ఆ డిజైన్ వల్ల కల్వకుర్తికి నష్టం: వంశీచంద్ రెడ్డి
Published Fri, Feb 3 2017 5:16 PM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM
Advertisement