Kalvakurthi lift irrigation
-
‘కల్వకుర్తి’ చివరి పంపు రెడీ
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్–3లో ఐదో పంపు వెట్ రన్ విజయవంతమైంది. లిఫ్ట్–3లో ఇప్పటికే నాలుగు పంపులు పని చేస్తుండగా, ఐదో పంప్ వెట్ రన్‌ను ప్రాజెక్టు ఇంజనీర్లు ఆదివారం పూర్తి చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో మూడు లిఫ్టులున్నాయి. లిఫ్ట్–1, లిఫ్ట్–2లో మూడేసి చొప్పున పంపులు ఇప్పటికే పని చేస్తున్నాయి. ఒక్కో పంపు 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయగలదు. కల్వకుర్తి కింది 0.35 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లూరు రిజర్వాయర్, 0.55 టీఎంసీల సామర్థ్యం గల సింగోటం రిజర్వాయర్లను లిఫ్ట్–1 పంపులతో నింపుతున్నారు. లిఫ్ట్–2 ద్వారా 2.14 టీఎంసీల సామర్థ్యమున్న జొన్నల బోగడ రిజర్వాయర్ నిండుతోంది. ఇక లిఫ్ట్–3 ద్వారా 0.98 టీఎంసీల గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నిండుతోంది. కానీ, ఐదో పంపు సిద్ధం కాకపోవడం వల్ల పూర్తి సామర్థ్యం మేరకు నీటి ఎత్తిపోత జరగడం లేదు. ఇప్పుడు ఐదో పంపు రన్ విజయవంతమైనందున పూర్తిగా నీటిని వినియోగించుకోవచ్చు. వర్షాలు బాగా కురుస్తుండటంతో శ్రీశైలం నుంచి అవసరమైన మేర నీరు తీసుకునే అవకాశం ఏర్పడింది. కల్వకుర్తి ప్రాజెక్టు కింది 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు ప్రాజెక్టు పరిధిలోని సుమారు 500 చెరువులను నింపాలని అధికారులు ప్రణాళిక రచించారు. లిఫ్ట్–3 ఐదో పంపు రన్ విజయవంతంగా నిర్వహించిన ఇంజనీర్లను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. -
‘కల్వకుర్తి’ కాల్వ సామర్థ్యం పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగు నీరందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పెరిగిన పంపుల డిశ్చార్జీలకు అనుగుణంగా ప్రధాన కాల్వ సామర్థ్యం పెంచేలా అడు గులు పడుతున్నాయి. ప్రస్తుతమున్న ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 3,800 నుంచి 4,800 క్యూసెక్కులకు పెంచేందుకు ప్రభుత్వం చర్య లు ప్రారంభించింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 25 టీఎంసీల మిగులు జలాలను తీసుకుంటూ 3.4 లక్షల ఎకరాలకు నీరి చ్చేలా కల్వకుర్తి పథకాన్ని 2005లో చేప ట్టారు. ప్రాజెక్టు మొత్తాన్ని 3 స్టేజీలుగా విడగొట్టి కొల్లాపూర్ స్టేజ్–1 కింద 13 వేల ఎకరాలు, జొన్నల బొగడ స్టేజ్–2 కింద 47 వేలు, గుడిపల్లెగట్టు స్టేజ్–3 కింద సుమారు 2.8 లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కల్వకుర్తికి నీటి కేటాయింపులు 40 టీఎంసీలకు పెంచడంతో పాటు, ఆయకట్టును 4 లక్షలకు పెంచారు. 5 మోటార్లు నడపడం వల్లే.. కల్వకుర్తిలో మొత్తం 5 మోటార్లను ఏర్పాటు చేయగా, ఇందులో ఒక మోటారును స్టాండ్‌బైగా పెట్టారు. దీంతో 4 మోటార్ల నుంచి 800 క్యూసెక్కుల చొప్పున 3,200 క్యూసెక్కుల నీరు తీసుకునేలా ప్రధాన కాల్వ లను డిజైన్ చేశారు. ప్రస్తుత అవసరాలకు 5 మోటార్లను నడిపిస్తు న్నారు. దీనికితోడు 20 శాతం అదనపు డిశ్చార్జి లభిస్తుండటంతో మొత్తంగా 4,800 క్యూసెక్కుల నీటిని తీసు కునే అవకాశ ముంది. ప్రస్తుతం ప్రధాన కాల్వకు ఆమేర సామర్థ్యం లేదు. దీంతో నీటిపారుదల శాఖ సాంకేతిక సలహాదారు విజయ్‌ప్రకాశ్, సీడీవో సీఈ నరేందర్‌రెడ్డి, ప్రాజెక్టు సీఈ ఖగేందర్తో ప్రభుత్వం నియ మించిన కమిటీ ఇటీవల నివేదిక ఇచ్చింది. కాల్వలో రాళ్లను, పూడికను తీసి పునరుద్ధ రించాలంది. జొన్నలబొగడ, గుడిపల్లిగట్టుల మధ్య ఉన్న 6.6 కీ.మీ. గ్రావిటీ కెనాల్లో తొలి కిలోమీటర్ మేర ఉన్న మట్టికట్ట ఎత్తు 2 మీటర్ల మేర పెంచాలంది. అలా అయితేనే డిశ్చార్జి పెరిగినా కాల్వ తెగిపోయే ప్రమాదం ఉండదని తెలిపింది. సర్ప్లస్ వియర్‌ను నిర్మించాలని ప్రతిపాదించింది. -
ఆ డిజైన్ వల్ల కల్వకుర్తికి నష్టం: వంశీచంద్ రెడ్డి
కల్వకుర్తి(నాగర్ కర్నూలు జిల్లా): కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి పంప్ హౌస్‌కు 300 మీటర్ల దగ్గర్లోనే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌ను డిజైన్ చేయడం వల్ల కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ దెబ్బ తింటుందని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని నిపుణులు కమిటీ కూడా తేల్చిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిజైన్ మార్పుకి క్యాబినెట్ ఆమోదం తెలిపడం అన్యాయమని మండిపడ్డారు. కేబినెట్లో ఉన్న జిల్లా మంత్రి జూపల్లి కృష్ణా రావు ప్రజలకు నష్టం జరుగుతున్నా మాట్లాడకపోవడం దారుణమని వంశీచంద్ అన్నారు. జూపల్లి రైతు వ్యతిరేకి అని విమర్శించారు. మంత్రి జూపల్లి వెంటనే రాజీనామా చేసి, నాగర్ కర్నూల్ ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి సవాల్‌ని స్వీకరిస్తున్నానని..రేపు ఉదయం 11 గంటలకు కల్వకుర్తి లోని అంబేడ్కర్ విగ్రహం దగ్గరకి రావాలని కోరారు.