సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగు నీరందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పెరిగిన పంపుల డిశ్చార్జీలకు అనుగుణంగా ప్రధాన కాల్వ సామర్థ్యం పెంచేలా అడు గులు పడుతున్నాయి. ప్రస్తుతమున్న ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 3,800 నుంచి 4,800 క్యూసెక్కులకు పెంచేందుకు ప్రభుత్వం చర్య లు ప్రారంభించింది.
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 25 టీఎంసీల మిగులు జలాలను తీసుకుంటూ 3.4 లక్షల ఎకరాలకు నీరి చ్చేలా కల్వకుర్తి పథకాన్ని 2005లో చేప ట్టారు. ప్రాజెక్టు మొత్తాన్ని 3 స్టేజీలుగా విడగొట్టి కొల్లాపూర్ స్టేజ్–1 కింద 13 వేల ఎకరాలు, జొన్నల బొగడ స్టేజ్–2 కింద 47 వేలు, గుడిపల్లెగట్టు స్టేజ్–3 కింద సుమారు 2.8 లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కల్వకుర్తికి నీటి కేటాయింపులు 40 టీఎంసీలకు పెంచడంతో పాటు, ఆయకట్టును 4 లక్షలకు పెంచారు.
5 మోటార్లు నడపడం వల్లే..
కల్వకుర్తిలో మొత్తం 5 మోటార్లను ఏర్పాటు చేయగా, ఇందులో ఒక మోటారును స్టాండ్‌బైగా పెట్టారు. దీంతో 4 మోటార్ల నుంచి 800 క్యూసెక్కుల చొప్పున 3,200 క్యూసెక్కుల నీరు తీసుకునేలా ప్రధాన కాల్వ లను డిజైన్ చేశారు. ప్రస్తుత అవసరాలకు 5 మోటార్లను నడిపిస్తు న్నారు. దీనికితోడు 20 శాతం అదనపు డిశ్చార్జి లభిస్తుండటంతో మొత్తంగా 4,800 క్యూసెక్కుల నీటిని తీసు కునే అవకాశ ముంది. ప్రస్తుతం ప్రధాన కాల్వకు ఆమేర సామర్థ్యం లేదు.
దీంతో నీటిపారుదల శాఖ సాంకేతిక సలహాదారు విజయ్‌ప్రకాశ్, సీడీవో సీఈ నరేందర్‌రెడ్డి, ప్రాజెక్టు సీఈ ఖగేందర్‌తో ప్రభుత్వం నియ మించిన కమిటీ ఇటీవల నివేదిక ఇచ్చింది. కాల్వలో రాళ్లను, పూడికను తీసి పునరుద్ధ రించాలంది. జొన్నలబొగడ, గుడిపల్లిగట్టుల మధ్య ఉన్న 6.6 కీ.మీ. గ్రావిటీ కెనాల్‌లో తొలి కిలోమీటర్ మేర ఉన్న మట్టికట్ట ఎత్తు 2 మీటర్ల మేర పెంచాలంది. అలా అయితేనే డిశ్చార్జి పెరిగినా కాల్వ తెగిపోయే ప్రమాదం ఉండదని తెలిపింది. సర్‌ప్లస్ వియర్‌ను నిర్మించాలని ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment