
నాగం, రేవంత్ తోడు దొంగలు: జూపల్లి
హైదరాబాద్: బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలు ఇద్దరు తోడు దొంగలని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు ఇద్దరు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. బాబును ప్రశ్నించే దమ్ములేని రేవంత్ దీక్షచేయడం హాస్యాస్పదమని జూపల్లి ధ్వజమెత్తారు.
ప్రజల కోసం ఏ రోజు కూడా నాగం, రేవంత్‌లు చిత్తశుద్ధితో పని చేయలేదన్నారు. పగటి వేషగాళ్లుగా మారిన వీరిద్దరూ రాజకీయ దురుద్దేశంతోనే కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదు. ప్రాజెక్టులు ఆనాడే కట్టి ఉంటే ఈనాడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు. వంద శాతం ప్రాజెక్టులు కట్టి తీరుతామని జూపల్లి స్పష్టం చేశారు.