ఉపాధిహామీ నిధులతో స్వచ్ఛభారత్ పనులు
మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వచ్ఛభారత్ మిషన్ కింద చేపట్టిన పనులకు ఉపాధిహామీ నిధులను వినియోగించుకోవాలని పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. ము ఖ్యంగా 2018 అక్టోబర్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవలంభించాల్సిన కార్యాచరణపై సోమవా రం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. మరుగుదొడ్ల నిర్మా ణంపై గ్రామీణులను చైతన్యం చేయడంతో పాటు, వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
రెం డేళ్లలో అన్ని గ్రామాల్లో వంద శాతం మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టేం దుకు కార్యాచరణ రూ పొందించాలని అధికారులను ఆదేశించారు. ఎంప్లారుుమెంట్ జనరేషన్ అండ్ మార్కె టింగ్ మిషన్ ద్వారా పెద్దఎత్తున యువతకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం పైనా ఆ విభాగం అధికారులతో మంత్రి సమీక్షిం చారు. ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచిం చారు. ఆదేశించారు.