
పుట్టగతులు ఉండవనే విమర్శలు: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులు ఉండవనే భయంతో అడ్డుపడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ పాలమూరు, రంగారెడ్డి డిజైన్ మార్పుపై కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శలను ఖండించారు. ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉండి ఏమీ చేయని పార్టీల నేతలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదన్నారు.