ప్రతిపక్షాలకు ఒక్క సీటూ రాదు: జూపల్లి
ఆమనగల్లు: వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ఒక్కసీటు కూడా వచ్చేది కష్టమే అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగ ల్లులో ఆదివారం ఒంటరి మహిళల కు పింఛన్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పా రు. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజల సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పని తీరు, పార్టీపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి సర్వే నిర్వహిం చారని.. సర్వేలో కేసీఆర్ 111 సీట్లు వస్తాయని చెప్పారని ఆయన వివరించారు. కానీ ఎన్నికలు జరిగే నాటికి అన్ని సీట్లనూ టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందనీ, ప్రతిపక్ష పార్టీలకు ఒక్కసీటు కూడా రాదన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ఒకటి, రెండు సీట్లు వస్తే రావచ్చని చెప్పారు. ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ విమర్శలు చేయడం సమం జసం కాదని ఈ సందర్భంగా జూపల్లి అన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ద్యాప విజితారెడ్డి, నాయకులు అశోక్‌రెడ్డి, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.