హైదరాబాద్: అటవీ భూముల అన్యాక్రాంతంపై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సొంత పార్టీ జెడ్పీటీసీని సస్పెండ్ చేయాలని ఆయన బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు కాసింపై వేటుకు వరంగల్ కలెక్టర్ సిఫారసు చేశారు. తక్షణమే జెడ్పీటీసీని సస్పెండ్ చేయాలని జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.