పల్లెల ప్రగతికే గ్రామజ్యోతి: మంత్రి జూపల్లి
Published Wed, Mar 15 2017 3:57 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
హైదరాబాద్ : పల్లె సీమలు స్వయం అభివృద్ధి సాధించాలనన‍్న ఉద్దేశ‍్యంతోనే గ్రామజ్యోతి పథకాన్ని ఏర్పాటు చేశామని తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం ఉదయం శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 2015-16, 2016-17లో రూ. 875 కోట్లు గ్రామజ్యోతి పథకం కింద గ్రామాల అభివృద్ధి పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బీటీ రహదార్లు వేస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 4800 కోట్లతో రహదారులు నిర్మించామని తెలిపారు. 8,222 గ్రామాలకు బీటీ రోడ్లు వేశామన్నారు. మిగిలిన 3027 గ్రామాలకు రహదార్లు వేస్తామని ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు.
Advertisement
Advertisement