
కరువు రహిత జిల్లాగా పాలమూరు
సీమాంధ్ర పాలకుల పాలనలో కరువు కాటకాలతో అల్లాడిన పాలమూరు కరువు రహిత జిల్లాగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఆత్మకూర్ : సీమాంధ్ర పాలకుల పాలనలో కరువు కాటకాలతో అల్లాడిన పాలమూరు కరువు రహిత జిల్లాగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఉదయం ఆత్మకూర్ పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ హెడ్‌రెగ్యులేటర్, ప్రధాన ఎడమకాల్వ మీదుగా వెళ్లి రామన్‌పాడు రిజర్వాయర్‌కు సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు మూడు రోజులపాటు ప్రాజెక్టుల బాటలో భాగంగా ప్రాజెక్టులను సందర్శించి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ళ్లనున్నట్లు తెలిపారు. ఈ ఖరీఫ్‌లో 4.5 లక్షల ఎకరాలకు, వచ్చే ఖరీఫ్ నాటికి జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషిచేస్తున్నామన్నారు. రామన్‌పాడు రిజర్వాయర్ షెట్టర్ల లీకేజీలను సరిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే పుష్కరఘాట్ల నిర్మాణాలు పరిశీలించి ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ భాస్కర్, ప్రాజెక్టుల సీఈ ఖగేందర్, ఎంపీపీ శ్రీధర్‌గౌడ్ పాల్గొన్నారు.
సౌకర్యాలు కల్పించాలి..
మండలంలోని శ్రీరంగాపూర్ రంగసముద్రం రిజర్వాయర్‌లో ముంపునకు గురవతున్న నాగరాల, పాక్షికంగా మునుగుతున్న శ్రీరంగాపూర్ రాజులగుట్ట ప్రాంతాన్ని మంత్రి జూపల్లి, జెడ్పీచైర్మన్ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినా పునరావాస కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. వెంటనే అన్ని సౌకర్యాలు కల్పించి ముంపు గ్రామాలను ఖాళీ చేయించాలని అధికారులను మం త్రి ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీరంగాపూర్ గ్రామస్తులు తమ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని, కంచిరావుపల్లి నుంచి శ్రీరంగాపూర్ వరకు డబుల్‌లైన్ రోడ్డు మంజూరు చేయాలని మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్, సర్పంచ్‌లు వెంకటస్వామి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.