మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధం
హరీశ్‌రావుకు మంత్రి జూపల్లి సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తరువాత ఎవరి ఆదాయం ఎంతో.. ఎవరెంత దోచుకున్నారో ఎల్‌బీ స్టేడియం వేదికగా మీడియా సమక్షంలో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం ఇంటికి రానవసరం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, అధికార ప్రతినిధి భవానిరెడ్డి తదితరులతో కలిసి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పేందుకు సీఎం రావలసిన అవసరం లేదని, తానే వస్తానని అన్నారు.
కేసీఆర్ కుటుంబం పదేళ్లు సాగించిన అక్రమాలపై తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అవినీతి, అక్రమాలు, దోపిడీని మొత్తం రుజువు చేస్తానని అన్నారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి కప్పం కడుతున్నాడని అంటున్న వాళ్లు.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్లాలకు ఇచ్చిన డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మూసీ రివర్ ఫ్రంట్ లో రూ.లక్షా యాభై వేల కోట్ల దోపిడీ జరిగిందని ప్రజలను కేటీఆర్, హరీశ్‌రావు తప్పుదోవ పట్టిస్తు న్నారని అన్నారు. తెలంగాణను మొత్తం దోచుకు న్నదే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అని, వాళ్లే ఇప్పుడు తాము నీతిమంతులమని మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2016లో మూసీ ఒడ్డు నుంచి 50 మీటర్లు బఫర్ జోన్ అని జీవో నెంబర్ 7 ఇచ్చిందని, 50 మీటర్ల బఫర్ జోన్‌లో నా ఇల్లు కూడా పోతుందని జూపల్లి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment