
పాలమూరు ప్రాజెక్టులపై రాద్ధాదంతం
విపక్షాలపై మంత్రి జూపల్లి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, అంజయ్య యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. రౌండ్ టేబుల్ సమావేశాలతో ప్రజలను విపక్షాలు తప్పు దోవపట్టిస్తున్నాయని, కోర్టు కేసులతో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలం గాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రాంతానికో వైఖరి ప్రదర్శించినట్లే ఇప్పుడు జిల్లాకో తీరుగా మాట్లాడుతోందని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు జిల్లాల మధ్య చిచ్చు పెడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.