సేంద్రియ సాగును ప్రోత్సహించండి
మంత్రి జూపల్లితో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధుల భేటీ
సాక్షి, హైదరాబాద్: సేంద్రియ వ్యవసాయా న్ని ప్రోత్సహించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ సంస్థ ప్రతినిధులు పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. ఆదివారం సచివాలయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీశ్రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ ట్రస్ట్ ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ఇన్‌చార్జి ఉమా మహేశ్వరి.. జూపల్లితో భేటీ అయ్యారు. సేంద్రియ వ్యవసాయం, ఎరువుల తయారీ వంటి అంశాల్లో తమ సంస్థ చేపడుతున్న కార్యకలాపాలను ఆమె వివరించారు.
దేశ వ్యాప్తంగా ఏపీ సహా 18 రాష్ట్రాల ప్రభుత్వా లతో తమ సంస్థ ఒప్పందం చేసుకుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 1,500 మంది రైతులకు సేంద్రియ సా గుపై శిక్షణ ఇచ్చి వారి ద్వారా కార్యక్రమాలను, సెమినార్లను నిర్వహిస్తు న్నామన్నారు. వెదురు బొంగులతో తక్కువ వ్యయంతో పాలీ హౌస్‌లను నిర్మించుకునేం దుకు సహకారం అందిస్తున్నామన్నారు. సెర్ప్ ద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సహకా రంతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశాలున్నా యో పరిశీలించాలని సీఈఓ పౌసమి బసుకు మంత్రి సూచించారు.
పథకాలన్నీ పక్కాగా అమలు కావాలి
ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రులు జూపల్లి, మహేందర్‌రెడ్డి అన్నా రు. సచివాలయంలో కొడంగల్ నియోజక వర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు.