Art of Living Organization
-
30–31 తేదీల్లో కిసాన్ మేళా– దేశీ విత్తనోత్సవం
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు(ఎస్.ఎస్.ఐ. ఎ.ఎస్.టి.) ఆధ్వర్యంలో మార్చి 30–31 తేదీల్లో రైతు మేళా, దేశీ విత్తనోత్సవం జరగనున్నాయి. వాతావరణ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మార్పుల నేపథ్యంలో కరువు, చీడపీడలను తట్టుకోవడానికి తమ సంప్రదాయ విత్తనాన్ని అభివృద్ధి చేసుకొని విత్తుకోవడమే ఉత్తమం. దేశీ విత్తన స్వాతంత్య్రం, దేశీ గోమాతే రైతులకు రక్షగా నిలుస్తాయని ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. భావిస్తోందని ప్రతినిధి ఉమామహేశ్వరి తెలిపారు. ఈ అంశాలపై రైతులను చైతన్యవంతం చేయడమే లక్ష్యమన్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే దేశీ విత్తన సంరక్షకులు ఈ మేళాలో పాల్గొంటారన్నారు. రెండున్నర కిలోల దేశీ వరి విత్తనంతో ఎకరం సాగు చేసే శ్రీ పద్ధతి, పావుకిలో విత్తనంతో సాగు చేసే పెరుమాళ్లు పద్ధతి, పంటల ప్రణాళిక రూపకల్పన, దేశీ విత్తన సంరక్షణలో మెలకువలు తదితర అంశాలపై ప్రకృతి వ్యవసాయదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. భోజన వసతి సదుపాయాలతోపాటు విత్తనాల స్టాల్‌కు కలిపి రూ. వెయ్యిని రైతు చందాగా చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. ఉమామహేశ్వరి – 90004 08907. 10న సేంద్రియ పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఈనెల 10(ఆదివారం)న సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకంపై మహిళా రైతు కొప్పుల శ్రీలక్ష్మి (రాజమండ్రి) రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. -
ప్రకృతి వ్యవసాయంపై 29 నుంచి వారం రోజుల శిక్షణ
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రకృతి వ్యవసాయ ట్రస్టు ఆధ్వర్యంలో బెంగళూరులోని మానస గంగ ఆశ్రమంలో ఈనెల 29 నుంచి వచ్చే నెల 4 వరకు గోఆధారిత ప్రకృతి వ్యవసాయం, 5 లేయర్ మోడల్, టెర్రస్ గార్డెనింగ్పై వారం రోజుల రెసిడెన్సియల్ శిక్షణా శిబిరం జరగనుంది. పత్తిలో గులాబీ పురుగు, మొక్కజొన్న ఆర్మీ లద్దెపురుగులను అరికట్టే పద్ధతులపై కూడా శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. ఉమామహేశ్వరి – 90004 08907, నాయుడు – 79937 95246, లయ – 88973 32296. -
సేంద్రియ సాగును ప్రోత్సహించండి
మంత్రి జూపల్లితో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధుల భేటీ సాక్షి, హైదరాబాద్: సేంద్రియ వ్యవసాయా న్ని ప్రోత్సహించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ సంస్థ ప్రతినిధులు పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. ఆదివారం సచివాలయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీశ్రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ ట్రస్ట్ ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జి ఉమా మహేశ్వరి.. జూపల్లితో భేటీ అయ్యారు. సేంద్రియ వ్యవసాయం, ఎరువుల తయారీ వంటి అంశాల్లో తమ సంస్థ చేపడుతున్న కార్యకలాపాలను ఆమె వివరించారు. దేశ వ్యాప్తంగా ఏపీ సహా 18 రాష్ట్రాల ప్రభుత్వా లతో తమ సంస్థ ఒప్పందం చేసుకుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 1,500 మంది రైతులకు సేంద్రియ సా గుపై శిక్షణ ఇచ్చి వారి ద్వారా కార్యక్రమాలను, సెమినార్లను నిర్వహిస్తు న్నామన్నారు. వెదురు బొంగులతో తక్కువ వ్యయంతో పాలీ హౌస్‌లను నిర్మించుకునేం దుకు సహకారం అందిస్తున్నామన్నారు. సెర్ప్ ద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సహకా రంతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశాలున్నా యో పరిశీలించాలని సీఈఓ పౌసమి బసుకు మంత్రి సూచించారు. పథకాలన్నీ పక్కాగా అమలు కావాలి ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రులు జూపల్లి, మహేందర్‌రెడ్డి అన్నా రు. సచివాలయంలో కొడంగల్ నియోజక వర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, ఆర్అండ్బీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. -
అందరూ నీవారే!
ప్ర : గురుదేవా, నా తల అనేక ఆలోచనలతో నిండిపోయి ఉంది. ఏం చేయాలో తెలియకుండా ఉంది. ఏదైనా సలహా చెప్పండి. జ : నీ తల అనేక ఆలోచనలతో నిండిపోయి ఉంటే, నేలపై పడుకొని దొర్లు. నీ శరీరంలో రక్తప్రసరణ మెరుగవటం గమనిస్తావు. రక్తప్రసరణ మెరుగైనపుడు నీకు కొంచెం బాగా అనిపిస్తుంది. ఈ కారణం చేతనే పూర్వం శయన ప్రదక్షిణం (అంగ ప్రదక్షిణం) చేసేవారు. ఒకసారి అనుభవించి, నీ బుద్ధిలో కలిగే మార్పును గమనించు. నీలోని భయాలు, ఆందోళన అన్నీ మాయమౌతాయి. ప్ర : యువత రాజకీయాలలోకి రావాలంటారా? జ : తప్పకుండా రావాలి. నేను దీనిని సమర్థిస్తాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తరపున (ఒరిస్సాలోని) భువనేశ్వర్‌లో కాలేజ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (మెరుగైన పరిపాలనా దక్షతను నేర్పే కళాశాల) ప్రారంభించాము. రాజకీయాలలో చేరి దేశసేవ చేద్దామనుకునే యువత అందులో చేరవచ్చు. యువత ఆలోచనా పరిధిని పెంచి, దేశంకోసం మెరుగ్గా ఆలోచించేలా అక్కడ శిక్షణనిస్తారు. ప్ర: గురుదేవా, అహంకారాన్ని వదిలేయడం ఎలా? జ : అహంకారాన్ని వదిలేయాలని ఎందుకు అనుకుంటున్నావు. దాన్ని కేవలం ఒక పక్కన ఉంచు. దానితో పోట్లాడకు, అంతే! మనం చాలాసార్లు, మనకు బాధ కలిగిస్తుంది కాబట్టి అహంకారాన్ని వదిలేయాలనుకుంటాం. అయితే ఈ అహంకారాన్ని వదిలేయాలనే కోరిక అహంకారాన్ని మరింత పెంచుతుంది. అహంకారాన్ని జయించాలంటే సహజంగా ఉండటమే అత్యంత సులభమైన మార్గం. అందరూ నీవారే అని తెలుసుకో చాలు. ప్ర : సమాజంలో నేడు మత్తుపానీయాల వాడకం చాలా హెచ్చుగా ఉంది. దీన్ని అరికట్టే మార్గం ఉందా? జ: అంతకన్నా చాలా ఎక్కువ మత్తు కలిగించే సత్సంగానికి వారిని తీసుకురండి. వారి చెడు అలవాట్లు అన్నీ మరిచిపోయేంత మత్తును (ఆధ్యాత్మిక జ్ఞానాన్ని) నేను వారికి ఇస్తాను. ఆధ్యాత్మికమార్గంలోకి వచ్చిన అనేకమంది ధూమపానం, తాగుడు, ఇతర చెడు అలవాట్లను వదలి మంచి మార్గంలోకి మళ్ళారు. కాబట్టి అటువంటి అలవాట్లు ఉన్నవారిని అసహ్యించుకోకండి. వారిని బుజ్జగించి సత్సంగానికి తీసుకురండి. వారిలో తప్పక మార్పు రావటం మీరు చూస్తారు. ఒకసారి దైవం పట్ల భక్తి, గాఢమైన ప్రేమ కలిగినవారు ఇక వెనుకకు మళ్ళటమంటూ ఉండదు. ప్ర : గురువుతో నా సంబంధం అనేక జన్మలవరకూ శాశ్వతంగా ఉంటుందా? అనేక జన్మలనుండీ మేము ఒకే గురువుతోనే ఉన్నామా? జ: నీ ప్రయాణాన్ని ఈ ఒక్క జన్మతోనే ఎందుకు పూర్తిచేయవు? వాయిదా ఎందుకు వేస్తున్నావు? నన్ను బుట్టలో పడేద్దామని ఈ చిక్కుప్రశ్న అడిగావు. ఈ జన్మలో నువ్వు చేయాల్సిన పని సరిగ్గా పూర్తిచేయి. వచ్చే జన్మలో మరలా అవకాశం ఉంటుందిలే అని, ఈరోజు పనిని వాయిదా వేయకు. వచ్చే జన్మలో నీవు ఎలా పుడతావో ఎవరికి తెలుసు? ఏ పశువులకొట్టంలోనో ఆవుగా పుట్టవచ్చు. కాబట్టి వచ్చే జన్మకోసం పనులను వాయిదా వేయకు. శ్రీశ్రీ రవిశంకర్ నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్