బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు(ఎస్.ఎస్.ఐ. ఎ.ఎస్.టి.) ఆధ్వర్యంలో మార్చి 30–31 తేదీల్లో రైతు మేళా, దేశీ విత్తనోత్సవం జరగనున్నాయి. వాతావరణ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మార్పుల నేపథ్యంలో కరువు, చీడపీడలను తట్టుకోవడానికి తమ సంప్రదాయ విత్తనాన్ని అభివృద్ధి చేసుకొని విత్తుకోవడమే ఉత్తమం. దేశీ విత్తన స్వాతంత్య్రం, దేశీ గోమాతే రైతులకు రక్షగా నిలుస్తాయని ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి.
భావిస్తోందని ప్రతినిధి ఉమామహేశ్వరి తెలిపారు. ఈ అంశాలపై రైతులను చైతన్యవంతం చేయడమే లక్ష్యమన్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే దేశీ విత్తన సంరక్షకులు ఈ మేళాలో పాల్గొంటారన్నారు. రెండున్నర కిలోల దేశీ వరి విత్తనంతో ఎకరం సాగు చేసే శ్రీ పద్ధతి, పావుకిలో విత్తనంతో సాగు చేసే పెరుమాళ్లు పద్ధతి, పంటల ప్రణాళిక రూపకల్పన, దేశీ విత్తన సంరక్షణలో మెలకువలు తదితర అంశాలపై ప్రకృతి వ్యవసాయదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. భోజన వసతి సదుపాయాలతోపాటు విత్తనాల స్టాల్‌కు కలిపి రూ. వెయ్యిని రైతు చందాగా చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. ఉమామహేశ్వరి – 90004 08907.
10న సేంద్రియ పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ
రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఈనెల 10(ఆదివారం)న సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకంపై మహిళా రైతు కొప్పుల శ్రీలక్ష్మి (రాజమండ్రి) రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255.
Comments
Please login to add a commentAdd a comment