11 నుంచి గుడివాడలో ఒంగోలు ఎడ్ల బండలాగుడు ప్రదర్శన | Training of mango farmers at Vijayawada on 22 | Sakshi
Sakshi News home page

11 నుంచి గుడివాడలో ఒంగోలు ఎడ్ల బండలాగుడు ప్రదర్శన

Published Tue, Jan 7 2020 6:31 AM | Last Updated on Tue, Jan 7 2020 6:31 AM

Training of mango farmers at Vijayawada on 22 - Sakshi

సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)కి చెందిన ఎన్టీఆర్‌2వైఎస్సార్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో గుడివాడ లింగవరం రోడ్డులోని కె.కన్వెన్షన్‌లో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన జరగనుంది. 9 విభాగాల్లో రూ. 5 వేల నుంచి రూ. లక్ష వరకు మొత్తం 60 బహుమతులు ఇవ్వనున్నారు. పశుపోషకులు, రైతులందరికీ ఆహ్వానం. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు.. 94909 20887, 84990 63579, 99124 30945

9న నాచుగుంట గోశాలలో వరి, చెరకు సాగుపై శిక్షణ
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట గోపాలకృష్ణ గోశాలలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, శ్రీగోపాల కృష్ణ గోశాల ఆధ్వర్యంలో ఈ నెల 9 (గురువారం)న వరి, చెరకు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఇవ్వనున్నారు. సేంద్రియ బెల్లం తయారీ, సేంద్రియ సర్టిఫికేషన్, వినియోగదారులకు  సేంద్రియ ఉత్పత్తుల అమ్మకంలో మెలకువలు తదితర అంశాలపై సీనియర్‌ రైతు రామకృష్ణంరాజు శిక్షణ ఇస్తారు. మధ్యాహ్న భోజన వసతి ఉంది.
వివరాలకు.. జగదీశ్‌ – 78934 56163.

22న విజయవాడలో మామిడి రైతులకు శిక్షణ
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఈనెల 22(శుక్రవారం)న విజయవాడ పడమట లంకలోని రైతు శిక్షణా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు శిక్షణ ఇస్తారు. మధ్యాహ్న భోజన సదుపాయం ఉంది. విజయవంతంగా సాగు చేస్తున్న రైతులు పాల్గొని ఇతర రైతులతో అనుభవాలను పంచుకోవలసిందిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కోరుతోంది. వివరాలకు.. జగదీష్‌ – 78934 56163.  

29న చోహన్‌ క్యు, సీవీఆర్‌ సాగు పద్ధతులపై శిక్షణ
రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం రిక్వెల్‌ ఫోర్డ్‌ ఇంటర్‌ నేషనల్‌ స్కూల్‌ వద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 29న ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు డా. చోహాన్‌ క్యు(దక్షిణ కొరియా) ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై నిపుణురాలు, ‘సర్ర’ డైరెక్టర్‌ రోహిణీ రెడ్డి (బెంగళూరు), మట్టి సేద్యం ఆవిష్కర్త చింతల వెంకట రెడ్డి(హైదరాబాద్‌) రైతులకు శిక్షణ ఇస్తారని న్యూలైఫ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు శివ షిండే తెలిపారు. చోహన్‌క్యు పద్ధతిపై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనా ఫలితాలను అధ్యాపకులు తెలియజేస్తారు. చోహన్‌క్యు రూపొందించిన ఫెయిత్‌ (ఫుడ్‌ ఆల్వేస్‌ ఇన్‌ ద హోమ్‌) బెడ్‌ తయారీ పద్ధతిలో కూరగాయల సాగుపై ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది.  ఆసక్తి గల రైతులు ఈ నెల 20 లోగా రూ. 200 చెల్లించి ముందాగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. సంపత్‌కుమార్‌ – 98854 55650, నీలిమ – 99636 23529.   

రైతుబంధు వ్యవసాయ కథల పోటీలు
2020 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ‘ఇయర్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌’గా ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై రైతుబంధు మాసపత్రిక నెస్ట్‌ ఫౌండేషన్, తెలంగాణ రిసోర్స్‌ సెంటర్‌ సహకారంతో వ్యవసాయరంగ కథల పోటీలను నిర్వహిస్తోంది. కథల స్వీకరణకు చివరి గడువు ఈ నెల 31. వివరాలకు.. ఎస్‌. లక్ష్మీ మోహన్‌ – 98489 02520

12న కొర్నెపాడులో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈ నెల 12 (ఆదివారం)న పుట్టగొడుగుల పెంపకంపై మహిళా రైతు కొప్పుల శ్రీలక్ష్మి (రాజమండ్రి) శిక్షణ ఇవ్వనున్నట్లు ఫౌండేషన్‌ చైర్మన్‌ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 97053 83666.

ఫిబ్రవరిలో జాతీయ ఉద్యాన ప్రదర్శన–2020
బెంగళూరు హెసరఘట్ట లేక్‌ పోస్ట్‌ ప్రాంతంలోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐ.ఐ.హెచ్‌.ఆర్‌.) ఆవరణలో ఫిబ్రవరి 5(శుక్ర) నుంచి 8వ తేదీ వరకు జాతీయ ఉద్యాన ప్రదర్శన –2020 జరగనుంది. వైవిధ్యభరితమైన అనేక రకాల పండ్లు, పూలు, కూరగాయలను పండించడంతోపాటు వాటిని యంత్రాల తోడ్పాటుతో ఉత్పత్తులుగా మార్చి వినియోగదారుల దగ్గరకు చేర్చుకునే వ్యూహాలపై ఐఐహెచ్‌ఆర్‌ దృష్టి కేంద్రీకరిస్తోంది. ఈ ఉద్యాన ప్రదర్శనలో కొత్త వంగడాలు, కొత్త ప్రాసెసింగ్‌ యంత్రాలు, మార్కెటింగ్‌ వాహనాలను ప్రదర్శనకు ఉంచుతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement