ఉద్యమంలా ‘ఉపాధి హామీ’ | Jupally Krishna Rao on Employment Guarantee Works | Sakshi
Sakshi News home page

ఉద్యమంలా ‘ఉపాధి హామీ’

Published Sun, Apr 16 2017 2:44 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

ఉద్యమంలా ‘ఉపాధి హామీ’ - Sakshi

ఉద్యమంలా ‘ఉపాధి హామీ’

► 18న ప్రతి మండలంలో ఉపాధి పనులపై సమావేశం
► మంత్రి జూపల్లి వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసు కెళ్లాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించా రు. ఉపాధిహామీ పనుల పురోగతిని జిల్లా, మండల స్థాయి అధికారులతో శనివారం ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించా రు. రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, సెర్ప్‌ ఉద్యోగులు, వీవోఏల సేవలను కూడా ఉపాధి హామీ పథ కం అమలులో వినియోగించుకోవాలని అధి కారులకు మంత్రి సూచించారు.

ఈ నెల 18న ప్రతి మండల కేంద్రంలో ఉపాధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు. వచ్చే వారంలో ఉపాధి పనులపై చర్చించేందుకు పంచాయతీ, మండల, జిల్లాపరిషత్‌ సర్వ సభ్య సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఖాళీ గా ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులను వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసు కోవాలని కమిషనర్‌ నీతూకుమారి ప్రసాద్‌ను ఆదేశించారు.

జూన్‌ నెలాఖరులోగా సుమారు 75 రోజులు పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టాలని జూపల్లి అధికారులకు సూచించా రు. జాబ్‌ కార్డులున్నవారిలో కనీసం 60 శాతం మంది కూలీలకు 100 రోజుల ఉపాధి కల్పించే లక్ష్యంతో పనిచేయాలన్నారు. చెరువు పూడికతీతపనులను ప్రారంభించని అధికారు లపై చర్యలు  తీసుకుంటామన్నారు.  

అలంపూర్‌కు వరం తుమ్మిళ్ల ప్రాజెక్ట్‌
తుమ్మిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమో దం తెలపడంతో గద్వాల జిల్లా అలంపూర్‌ రైతాంగానికి మంచి రోజులు వచ్చాయని జూపల్లి అన్నారు. సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా రాజోలిబండ డైవర్షన్  స్కీమ్‌(ఆర్‌డీఎస్‌)కు చుక్కనీరు కూడా రాకపోవడంతో ఆ ప్రాంత రైతాంగం కుదేలైందన్నారు. ఈ నేపథ్యంలో తుమ్మిళ్ల ఎత్తిపోతలకు మొదటి విడతగా రూ.397 కోట్లు, రెండో విడతలో రూ.386కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, 2018 చివరి నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు.

వేసవిలోగా వంతెనల నిర్మాణం
పీఎంజీఎస్‌వై, నాబార్డ్‌ నిధులతో చేపట్టిన వంతెనలు, రహదారుల నిర్మాణ పనులను వేసవిలోగా పూర్తి చేయాలని జూపల్లి అధికారులను ఆదేశించారు. రహ దారి, వంతెనల నిర్మాణ పనుల పురోగతిపై పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో శనివారం మంత్రి సమీక్షిం చారు. నిర్మాణ పనులు నత్తనడకన సాగ డంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలనా అనుమతులు వచ్చిన వారం రోజుల్లోపే అంచనాలు, డిజైనింగ్‌ పూర్తి చేయాలని, నెల రోజుల్లో టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలని, టెండర్‌ ప్రక్రియ ముగిసిన 15 రోజుల్లో కాంట్రాక్టర్‌కు వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వాలని సూచించారు.

కాంగ్రెస్‌ నేతలవే కాపీ బతుకులు: జూపల్లి
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతుల కోసం సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఉచిత ఎరువుల పంపిణీ నిర్ణయం విప్లవాత్మ కమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రధాని, సీఎం తీసుకోని ఇలాంటి నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించాల్సిందిపోయి మతిభ్రమించే లా మాట్లాడుతున్నాయన్నారు.

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డితో కలసి శనివారం ఆయన టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. ఉచిత ఎరువుల పంపిణీ ఎన్ని కల కోసం తీసుకున్న నిర్ణయం కాదని, ఎన్నికల కోసమే పథకాలు తెచ్చిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదన్నారు. కాంగ్రెస్‌ వాళ్లను కాపీ కొట్టాల్సిన ఖర్మ తమకు పట్టలేదని, అసలైన కాపీ బతుకులు కాంగ్రెస్‌ నేతలవే నన్నారు. విపక్ష నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని గువ్వల హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ మాయమవడం ఖాయ మని నారాయణరెడ్డి అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement