
పల్లె ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. శుక్రవారం సెర్ప్ కార్యాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రూ.620కోట్ల వ్యయంతో 150 మండలాల్లో కార్యక్రమం జరుగు తుందని జూపల్లి వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో గ్రామ గ్రామాన వ్యవసాయ అనుబంధ, మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మండలాల విభజన నేపథ్యంలో 182 మండలాల్లో పల్లె ప్రగతి అమలు కానుందని, ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సెర్ప్ సీఈవో పౌసమీబసు వివరించారు.