నేటి నుంచి ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి
► మొత్తం 1,08,302 మంది లబ్ధిదారులకు పథకం వర్తింపు
► ఆమనగల్లులో ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి’పథకం ఆదివారం(నేడు) నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించ నున్నారు. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 1 లక్షా 46 వేల దరఖాస్తులు రాగా, ఇందులో 1,08,302 మంది మహిళలను అర్హులుగా తేల్చారు. ఎంపిౖకైన లబ్ధిదారులకు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లోనూ నేడు ఆర్థిక భృతి మంజూరు పత్రాలను స్థానిక ఎమ్మెల్యేలు అందజేయనున్నారు.
జూన్ 6 నుంచి లబ్ధిదారుల బ్యాంక్ లేదా పోస్టాఫీసు ఖాతాలకు ఆర్థిక భృతి మొత్తాన్ని జమ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధి కారులు తెలిపారు. వాస్తవానికి ఒంటరి మహిళ లకు ఆర్థిక భృతిని ఏప్రిల్ 1 నుంచి వర్తింపజే యాలని ప్రభుత్వం భావించినందున జూన్ 6 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో ఏప్రిల్, మేలకు సంబంధించిన మొత్తాన్ని(రూ.2వేలు) జమచే యనున్నారు. ఈ పథకం అమలు నిమిత్తం ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.10.08 కోట్ల భారం పడనుందని అధికారులు పేర్కొన్నారు.