సాక్షి, హైదరాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఈ నెల 20న జరగాల్సిన కాంగ్రెస్‌సభ వాయిదా పడింది. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీలో చేరేందుకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకాగాంధీ సమక్షంలో నిర్వహించాలనుకున్న ఈ సభను వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అయితే, సభకు ప్రియాంకాగాంధీ హాజరవుతారని తొలుత చెప్పినప్పటికీ, ఆమె వచ్చే అవకాశం లేనందున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వస్తారనే చర్చ జరిగింది.
కానీ, ఖమ్మం సభకు అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చిన నేపథ్యంలో కొల్లాపూర్ సభకు ప్రియాంకాగాంధీ రావడమే సరైందని భావించిన టీపీసీసీ నేతలు ఆ మేరకు కొల్లాపూర్‌సభను వాయిదా వేయాలని నిర్ణయించారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ నెల 20వ తేదీ తర్వాత ప్రియాంక సమయం కోరగా, 23, 25, 28 తేదీల్లో ఏదో ఒకరోజు సభ ఏర్పాటు చేసుకోవచ్చని, తేదీ ఖరారయిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం వచ్చినట్టు తెలిసింది.
టీపీసీసీ ఆస్తుల పరిరక్షణకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ఆస్తుల పరిరక్షణ కోసం మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి చైర్మన్‌గా, సౌదారాం గంగారం కన్వీనర్‌గా ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఆమోదం తెలపడంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్‌కుమార్ గౌడ్ ఉత్తర్వులిచ్చారు. ఈ కమిటీలో పార్టీ నేతలు జి. నిరంజన్, కె.దయాసాగర్‌రావు, పొన్నం అశోక్‌గౌడ్, ఎం. రాంచంద్రారెడ్డి, టి.బెల్లయ్య నాయక్, ఎం.ఎ. ఫహీమ్‌లను సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment