
సాక్షి, హైదరాబాద్ : కొల్లాపూర్ టికెట్ కోసం టీ కాంగ్రెస్ సీనియర్ల మధ్య పంచాయితీ నడుస్తోంది. తాము చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలని పాలమూరు కాంగ్రెస్ సీనియర్లు పట్టుబడుతున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్వర్ రావుకే ఇవ్వాలని జైపాల్ రెడ్డి.. జెన్కోలో ఏడీఈగా రాజీనామా చేసిన సుధాకర్ రావుకే టికెట్ ఇవ్వాలని చిన్నారెడ్డి హైకమాండ్‌ను కోరారు. కాగా 2014లో కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని లేదంటే ఊరుకునేది లేదని డీకే అరుణ పట్టుబట్టారు.
కొద్దిరోజుల క్రితమే చిన్నారెడ్డి! సుధాకర్ రావుకు కాంగ్రెస్ కండువా కప్పేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. డీకే అరుణ డిమాండ్‌తో సుధాకర్ రావు జాయినింగ్ కాస్తా నిలిచిపోయింది. మొత్తానికి కొల్లాపూర్ టికెట్ ఎవరికి కేటాయిస్తారా అని కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment