బాల్యవివాహాల నిలిపివేత
Published Thu, Apr 27 2017 2:18 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM
► తల్లిదండ్రులను కౌన్సెలింగ్
కొల్లాపూర్ రూరల్/బల్మూర్: నాగర్‌కర్నూలు జిల్లాలో జరిగే బాల్యవిహాలను అధికారులు నిలిపివేయించారు. మండల పరిధిలోని బోయలపల్లిలో బాల్యవివాహం చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ సుందర్రాజు, ఎస్‌ఐ సత్యనారాయణ, సీడీపీఓ వెంకటరమణ, ఆర్‌ఐ నసీరోద్దీన్ బుధవారం గ్రామానికి చేరుకుని అడ్డుకున్నారు. పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాల్యవివాహాలతో కలిగే అనర్థాలను వివరించారు. కాదని పెళ్లి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
బల్మూర్‌లో..
మండల కేంద్రంలో అధికారులు బాల్య వివాహన్ని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన మైనర్‌ను అచ్చంపేట మండలం లింగోటం గ్రామానికి చెందిన యువకుడితో ఈనెల 29న వివాహం జరిపించాడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మి, తహసీల్దార్ అంజిరెడ్డి, ఎస్‌ఐ వెంకన్న బుధవారం బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. మేజర్‌అయ్యేంత వరకు పెళ్లి చేయొద్దని సూచించారు. వారించడంతో ఒప్పంద పత్రం రాయించుకుని బాలికను చైల్డ్‌కేర్‌కు తరలించారు.
Advertisement
Advertisement