పెర్కిట్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే పేర్కొన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నిర్వహించిన సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిస్తే చెరుకు రైతుల జీవితాలు బాగుపడతాయని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment