
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్ర ప్రసాద్
సూర్యాపేట క్రైం: రోడ్డు భద్రతా నియమాలు పాటించడం అందరి బాధ్యత అని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి 65, 365 (బీబీ), 365(ఏ)పై సీఐలు, ఎస్‌ఐలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఎంఆర్, జాతీయ రహదారుల సంస్థ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయంగా పనిచేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జాతీయ రహదారుల వెంట ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, రవి, నాగభూషణం, సీఐలు సోమనారాయణ సింగ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాస్, ఆంజనేయులు, పీఎన్‌డీ.ప్రసాద్, ఎస్‌ఐలు సాయిరాం, విష్ణుమూర్తి, లోకేష్, డీసీఆర్వీ రోడ్ సేఫ్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గంజాయి, డ్రగ్స్ నివారణకు జిల్లాకు నార్కోటిక్ డాగ్
అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలను గుర్తించి పట్టుకోవడానికి జిల్లాకు నార్కోటిక్ డాగ్(రోలెక్స్)ను కేటాయించారు. ఈరోలెక్స్ పనితీరుపై శుక్రవారం డాగ్ హ్యండిలర్‌తో నిర్వహించిన రిహార్సల్‌ను ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా టన్నులకొద్దీ గంజాయిని సీజ్ చేశామన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు శ్రీనివాస రావు, శ్రీనివాస్, గోవిందరావు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment