సూర్యాపేట: పట్టణంలోని పలు వార్డుల్లో శునకాలు శుక్రవారం 15మందిపై దాడిచేసి గాయపరిచాయి. పట్టణంలోని రాజీవ్‌నగర్, కొత్తగూడెం బజార్, నెహ్రూనగర్‌లో 15మందిని శునకాలు గాయపరిచాయి. గాయపడ్డ వారిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి టీకాలు వేశారు.
ఇటీవల సూర్యాపేట పట్టణంలో కుక్కల బెడద తీవ్రమైందని, వాటిని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, వివిధ ప్రాంతాల నుంచి సూర్యాపేట ఆస్పత్రికి రోజుకు కనీసం 30 నుంచి 40 కుక్క కాటు కేసులు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.
ఆత్మకూర్‌లో 6 గొర్రెలు మృతి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : వీధి కుక్కల దాడిలో ఆరు గొర్రెలు మృతిచెందిన సంఘటన ఆత్మకూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముత్యాల మల్లయ్య, నగిరె కృష్ణయ్యలు గొర్రెలను మేత కోసం గ్రామ శివారులోకి వేర్వేరుగా తోలుకుని వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో గుంపులుగా వచ్చిన కుక్కలు ఒక్కసారిగా మందపై దాడిచేసి దాదాపు ఆరు గొర్రెలను చంపివేశాయి.
Comments
Please login to add a commentAdd a comment