సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకితం చేశారు. రెండో పంప్ హౌస్ వద్ద పైలాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్.. అనంతరం స్విచ్ ఆన్ చేశారు.
కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసగూడెంలో సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను సీఎం రేవంత్.. రైతాంగానికి అంకితం చేశారు. రెండో పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసి గోదావరి జలాలను దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో గోదావరి జలాలకు సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. దీంతో, కాలువలోకి గోదావరి జలాలను విడుదల చేశారు. ఇక, సీతారామ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా నదిలో గోదావరి నీరు కలవనుంది. ఈ క్రమంలో కృష్ణా నది చివరి పొలాలకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్ట్ పూర్తికి సహకరిస్తున్నాం. ఇది మా విశ్వసనీయతకు గుర్తింపు. ప్రాజెక్ట్‌ల మీద సమగ్రంగా చర్చించాం. నల్లగొండ జిల్లాలో చాలా ప్రాజెక్ట్‌లు అసంపూర్తిగా ఉన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల రీడిజైన్ పేరుతో వేల కోట్లు దండుకున్నారు. కేసీఆర్, హరీష్ రావు బోగస్ మాటలు చెప్పారు. ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని కేసీఆర్ ఎప్పుడూ అనుకోలేదు. దోపిడీ బయటపడుతుందని బీఆర్‌ఎస్ దేనికీ డీపీఆర్‌లు ఇవ్వలేదు. మా శ్రమను హరీష్ రావు చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నాలుగేళ్లుగా సీతారామ పంపులను ఆన్ చేయలేదు. మేం నీళ్లు చల్లుకోలేదు.. గోదారమ్మ మా మీద నీళ్లు చల్లింది. గత పదేళ్లలో రూ.లక్షా 80వేల కోట్లు ఖర్చు చేసినా రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వలేకపోయారు. ఖమ్మం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఇక, మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. నా కల సాకారం చేసినందుకు సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు. గత ప్రభుత్వం సీతారామా ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment