సాక్షి, ఖమ్మం: నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆవేదన... అవమానాలు చెప్పాలనుకుంటున్నా.. వాస్తవాలు ప్రజలకు అవసరం అంటూ మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. పేరు కోసం, ఫ్లెక్సీ కోసం రాజకీయం చేయలేదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతోనే పనిచేశానన్నారు.
శ్రీరామచంద్రుడు దయ, ఖమ్మం జిల్లా ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్‌లో చేరాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి లో భాగస్వామ్యం కల్పించారు. ఖమ్మం జిల్లాకి సంబంధించి సుదీర్ఘ ప్రయాణం చేసిన గోదావరి తల్లిని వాడుకోలేక పోతున్నాం. నాకు అవకాశం వచ్చినప్పుడుల్లా... నాటి బడ్జెట్ తక్కువగా ఉండేది.. ఇరిగేషన్‌కి కూడా తక్కువ బడ్జెట్ ఉండేది. కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు నీరు ఇవ్వాలనేది నా సంకల్పం’’ అని తుమ్మల పేర్కొన్నారు.
‘‘ఏ ప్రభుత్వంలో ఉన్నా దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించా.. నాడు బడ్జెట్‌లో దేవదులను పూర్తి చేశాం. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ గా విడదీశారు. ఇందిరా సాగర్ వద్ద బ్యాక్ వాటర్‌కు ఆనాటి సీఎం వైఎస్సార్ టెండర్లు పిలిచారు.. దురదృష్టవశాత్తు వైఎస్సార్ మృతి ఆ ప్రాజెక్టుకి శాపం అయింది.’’ అని తమ్మల వివరించారు.
తెలంగాణ ఉద్యమం ఫలితంగా రాష్ట్రం ఏర్పాటయ్యింది. ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఆనాటి సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు వెళ్లాను. కేసీఆర్‌తో శంకుస్థాపన చేశారు... పనులు ప్రారంభం అయ్యాయి... మళ్ళీ జరిగిన ఎన్నికల తరవాత పనులు ఆగిపోయాయి. రోళ్లపాడు ఆలైన్‌మెంట్ జూలూరుపాడుకి మార్చారు. బిజి కొత్తూరు 150 చెక్ డ్యాంలు నిర్మించాలి. జూలూరుపాడు టన్నెల్ ప్రాతిపదిన లేదు.. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాను. ఇప్పటికే 8వేల కోట్లు ఖర్చు చేశారు. పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరాను’’ అని తుమ్మల చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment