
మున్నేరుకు అనూహ్యంగా వచ్చిన వరదతో ఖమ్మం, ఖమ్మం రూరల్ మండలాల్లోని పరీవాహక ప్రాంత కాలనీల్లోకి నీరు చేరింది

మున్నేరు నీటిమట్టం క్రమంగా తగ్గుతూ సోమవారం ఉదయానికి సాధారణ స్థితికి చేరింది

దీంతో కట్టుబట్టలతో వెళ్లిపోయిన స్థానికులు ఇళ్లకు చేరుకునే సరికి నామరూపాలు లేకుండా పోయిన ఇళ్లు, సామగ్రిని చూసి కన్నీరుమున్నీరయ్యారు

ఇల్లు, రోడ్డు తేడా లేకుండా బురద మేటలు వేయడంతో అడుగు తీసి అడుగు వేయడం కష్టమైంది

కళ్లలో కన్నీళ్లు సుడులు తిరుగుతుండగా ఒక్కో సామగ్రిని నుంచి నుంచి వేరు చేస్తూ ఈ కష్టాలకు కారణమైన మున్నేరు నీటిలోనే శుభ్రం చేసుకోవడం కనిపించింది





























