Munneru barrage
-
వందేళ్ల వంతెన చాన్నాళ్లు 12 ఏళ్ల వంతెనకు నూరేళ్లు
నిజాం కాలంలో వందేళ్ల క్రితం ఖమ్మం మున్నేరుపై రాతి కట్టడంగా నిర్మించిన బ్రిడ్జి 36.9 అడుగుల మేర వరదను తట్టుకుని నిలబడింది. అదే మున్నేరుపై ప్రకాశ్‌నగర్ వద్ద పదేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి స్పాన్ మాత్రం పక్కకు జరిగింది. భారీ వరదతో బ్రిడ్జి స్పాన్ బేరింగ్ పైనుంచి పక్కకు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల 1న ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు మున్నేరుకు భారీగా వరద వచి్చంది. 36.9 అడుగుల మేర వరద ప్రవాహం ఆరు గంటలపాటు కొనసాగింది. ఈ వరద ప్రవాహంతోనే బ్రిడ్జి స్పాన్ బేరింగ్ల పైనుంచి పక్కకు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకొన్ని గంటలు వరద ఇలాగే కొనసాగితే బ్రిడ్జికి ముప్పు వాటిల్లేదని నిపుణులు చెబుతున్నారు. – ఖమ్మం మయూరి సెంటర్పదిలంగా వందేళ్ల బ్రిడ్జి.. అనేకసార్లు భారీగా వరదల తాకిడి తగిలినా ఎక్కడా తొణుకు లేకుండా ఖమ్మం కాల్వొడ్డు వద్ద నిర్మించిన బ్రిడ్జి పదిలంగా నిలిచింది. నిజాంల కాలంలో రాతితో కట్టిన ఈ బ్రిడ్జి వద్ద పలుసార్లు 30 అడుగులకు పైగా వరద ప్రవహించినా చెక్కుచెదరలేదు. గత పదేళ్లుగా బ్రిడ్జి పని అయిపోయిందని, వందేళ్లు దాటినందున ప్రమాదం పొంచి ఉన్నట్లేనని అధికార యంత్రాంగం, ప్రజలు చర్చించుకుంటున్నా.. సగర్వంగా నిలవడం విశేషం. కాగా, ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపై ఎస్12 స్పాన్ పక్కకు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూడో బ్రిడ్జిగా నిర్మాణం.. హైదరాబాద్, సూర్యాపేట, హైదరాబాద్, కోదాడ, విజయవాడ ప్రాంతాల వైపు నుంచి ఖమ్మం నగరంలోకి వచ్చేందుకు మున్నేరుపై మూడు వంతెనల నిర్మాణం జరిగింది. 110 ఏళ్ల క్రితం నిజాం కాలంలో కాల్వొడ్డు వద్ద ఒక బ్రిడ్జి.. కరుణగిరి వద్ద రెండు దశాబ్దాల క్రితం మరో బ్రిడ్జి నిర్మించారు. నానాటికీ రద్దీ పెరగడంతో 2010లో ప్రకాశ్‌నగర్ వద్ద మున్నేరుపై మూడో బ్రిడ్జి నిర్మాణానికి నాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2013లో ఈ బ్రిడ్జి అందుబాటులోకి రాగా.. గత ఏడాది 30.7 అడుగులు, ఈనెల 1న 36.9 అడుగుల మేర వరద వచి్చంది. తాజా వరదతో బ్రిడ్జి నాణ్యత వెలుగులోకి వచి్చందన్న చర్చ జరుగుతోంది. -
ఖమ్మం : ముంచెత్తిన మున్నేరు.. ఖమ్మం కకావికలం (ఫొటోలు)
-
ముంచెత్తిన మున్నేరు.. ఖమ్మం కకావికలం
-
మంత్రి తుమ్మలకు నిరసన సెగ
సాక్షి,ఖమ్మం : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు నిరసన సెగ తగిలింది. ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లిన తుమ్మలకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు.గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. ప్రకాశ్ నగర్ వద్ద డేంజర్ లెవల్లో మున్నేరు ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం పట్టణంలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇళ్ల మధ్య నుంచి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరు వాగు గోదావరి నదిని తలపిస్తోంది. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో ఖమ్మం ప్రకాష నగర్ బ్రిడ్జ్‌పై తొమ్మిది మంది చిక్కుకున్నారు.ఈ తరుణంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వరద పరిశీలించేందుకు తమ్మల నాగేశ్వర్రావు వెళ్లారు. ఆ సమయంలో తుమ్మలకు నిరసన సెగ తగిలింది. ప్రభుత్వానికి,తుమ్మలకు వ్యతిరేకంగా వరద పరిశీలిస్తున్న తుమ్మలను అడ్డుకున్నారు. ఉదయం 9 గంటల నుండి వరదల్లో చిక్కుకున్న 9 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించ లేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కృష్ణమ్మకు భారీగా వరద
సాక్షి, అమరావతి: తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని మున్నేరు ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 1.97 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా.. అదే స్థాయిలో దిగువకు వదిలేశారు. ఈ ప్రవాహానికి కట్టలేరు, బుడమేరు, పాలేరు తదితర వాగులు, వంకల ప్రవాహం తోడవుతుండటంతో పులిచింతల ప్రాజెక్ట్‌కు దిగువన కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 2,60,875 క్యూసెక్కులు చేరుతుండటంతో.. అంతే స్థాయిలో వరదను 55 గేట్లను 6 అడుగులు, 15 గేట్లను ఏడు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. జూలై చివరి వారంలో ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద రావడం.. గేట్లు ఎత్తి సముద్రంలోకి ఈ స్థాయిలో వరదను వదిలేయడం ఇదే తొలిసారి. ఖమ్మం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో శుక్రవారం వర్షాలు తెరిపి ఇవ్వడంతో శనివారం ప్రకాశం బ్యారేజీలోకి చేరే ప్రవాహం తగ్గనుంది. ఎగువ కృష్ణాలో స్థిరంగా ప్రవాహం పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి 1.66 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద కాస్త తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1.07 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 59 టీఎంసీలకు చేరుకుంది. జూరాలకు ఎగువ నుంచి 1.22 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో స్పిల్ వే గేట్లు, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తున్నారు. జూరాల నుంచి 1,20,390 క్యూసెక్కులు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల సుంకేశుల బ్యారేజ్ నుంచి 4,311, హంద్రీ నుంచి 117 వెరసి 1,24,818 క్యూసెక్కులు శ్రీశైలంలోకి చేరుతుండటంతో నీటి నిల్వ 45.53 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శనివారం శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి చేరే వరద పెరగనుంది. ఇక తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు మూసీ నుంచి పులిచింతలలోకి 55,144 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 28.03 టీఎంసీలకు చేరుకుంది. మరో 17 టీఎంసీలు చేరితే పులిచింతల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేయనున్నారు. -
విషాదం: బతుకు దెరువు కోసం వచ్చి.. మున్నేరువాగులో గల్లంతు..
సాక్షి, మహబూబాబాద్(వరంగల్) : మానుకోట జిల్లా కేంద్రం శివారులోని మున్నేరువాగులో పడి యువకుడు గల్లంతైన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని పోచమ్మమైదాన్ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ (30) బతుకుదెరువు కోసం మానుకోటకు వచ్చాడు. జిల్లా కేంద్రంలోని లక్ష్మి థియేటర్ వెనుక ప్రాంతంలో నివాసం ఉండే అమ్జద్ వద్ద మార్బుల్ బండలు పరిచే పని చేస్తున్నాడు. కాగా, గురువారం మధ్యాహ్నం సమీప బంధువులు అజీమ్, యాసిన్, ఇర్ఫాన్ మున్నేరువాగు చెక్ డ్యాం సమీపంలోకి చేరుకుని మద్యం సేవించారు. అనంతరం ఇర్ఫాన్ ఈతకొడతానని చెప్పి మున్నేరువాగు నీటి ప్రవాహంలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో యాసిన్ వాగులో దిగి వెతికాడు. ఆచూకి లభ్యంకాకపోవడంతో మరో మిత్రుడు మౌసిన్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పడతోపాటు, డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో టౌన్ ఎస్హెచ్ఓ జూపల్లి వెంకటరత్నం, టౌన్ ఎస్సై గాలిబ్, రూరల్ ఎస్సై నగేష్, బ్లూ కోల్ట్స్ పీసీలు వీరన్న, విజయ్‌కుమార్, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతోపాటు స్థానికులు మున్నేరువాగు నీటిలో ఇర్ఫాన్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇర్ఫాన్ ఆచూకీ లభ్యంకాలేదు. కాగా, ఇర్ఫాన్‌కు భార్య, కుమార్తె ఉండగా ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉంది. చదవండి: లాక్ డౌన్ ఆసరా చేసుకుని .. బావమరిది.. దారి దోపిడీలు.. -
పులిచింతలపై నిలదీద్దాం
♦ పరిహారంపై ఏపీ తీరును ఎండగట్టేందుకు సిద్ధమైన తెలంగాణ ♦ ఇప్పటికే అక్రమ ప్రాజెక్టులపై గరంగరం ♦ పురుషోత్తపట్నం, శివభాష్యం సాగర్‌పై బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదులు ♦ మున్నేరు బ్యారేజీపైనా అభ్యంతరం ♦ తాజాగా పులిచింతలను తెరపైకి తెస్తున్న తెలంగాణ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం, బోర్డుల వద్ద అడ్డుపుల్లలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ ముప్పేట దాడి చేస్తోంది. ఇప్పటికే ఏపీ గోదావరిపై చేపట్టిన పురుషోత్తపట్నం, కృష్ణా నదిపై చేపట్టిన శివభాష్యం సాగర్, మున్నేరు బ్యారేజీ నిర్మాణంపై అభ్యంతరాలు తెలిపిన తెలంగాణ... తాజాగా పులిచింతల పరిహారం అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమైంది. ఏటా పులిచింతల పరిహారంపై ప్రశ్నిస్తున్నా స్పందన లేకపోవడంతో దీనిపై ఏపీని గట్టిగా నిలదీయాలన్న పట్టుదలతో ఉంది. వరుసగా అస్త్రాలు.. తెలంగాణ చేపడుతున్న అనేక ప్రాజెక్టుల విషయంలో ఏపీ జోక్యం పెరిగింది. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాల మేరకు నీటి వినియోగం చేస్తున్నామని చెబుతున్నా... ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్ర జల సంఘం, బోర్డుల వద్ద ఫిర్యాదులు చేస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ.. పోలవరం ఎడమకాల్వపై ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నంపై గోదావరి బోర్డుకు ఫిర్యా దు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కర్నూలు జిల్లాలో చేపడుతున్న శివభాష్యం సాగర్‌పైనా ఇటీవలే కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసిం ది. కృష్ణా జిల్లాలో చేపట్టిన మున్నేరు బ్యారేజీ నిర్మాణంపై కూడా అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ బ్యారేజీ నిర్మాణంతో తెలంగాణ ప్రాంతం లో ముంపు ఉంటుందని సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. ఇప్పుడు పులిచింతలపై దృష్టి సారించింది. అసంపూర్ణ పునరావాసంతో ఏటా పులిచింతల కింద తెలంగాణ గ్రామాలు ముంపు బారిన పడుతున్నా ఏపీ స్పందన సరిగా లేదని తెలంగాణ గుర్రుగా ఉంది. పులిచింతలలో 45.7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఈ నీటితో నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలు ముంపునకు గురవుతు న్నాయి. ఈ గ్రామాల పునరావాసానికి పరిహా రం కింద రూ.381 కోట్లు ఖర్చవుతుందని లెక్కలు వేశారు. ఈ నిధుల విడుదలలో జాప్యం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం రేగింది. ఓ దశలో గవర్నర్ జోక్యం చేసుకోవడంతో పరిహార చెల్లింపులకు ఓకే చెప్పిన ఏపీ.. రూ.53 కోట్లు ఒకమారు, రూ.75 కోట్లు ఇంకోమారు విడుదల చేసింది. ఇవిపోను ఇంకా భూసేకరణకు రూ.20 కోట్లు, దేవాలయాల పునర్నిర్మాణానికి రూ.15 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.25 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు రూ.50 కోట్లు, ఇతర వసతులకు మొత్తంగా రూ.115 కోట్లు రావాల్సి ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని గతేడాది అక్టోబర్‌లో ఏపీకి విన్నవించింది. రూ.49 కోట్లు మాత్రమే ఇచ్చిన ఏపీ రాష్ట్రం విన్నవించిన ఆరు నెలలకు స్పందించిన ఏపీ.. పులిచింతల జలాశయంలో ముంపునకు గురైన నాలుగు ఎత్తిపోతల పథకాలను మరోచోటుకు తరలించడానికి రూ.49 కోట్ల పరిహారాన్ని గత నెల చివరి వారంలో విడుదల చేసింది. మిగతా రూ.66 కోట్లపై పేచీ పెడుతోంది. భూనిర్వాసితులు, సహాయ పునరావాస ప్యాకేజీ కింద పరిహారం ఇప్పటికే చెల్లించామని, తెలంగాణకు బకాయిలేమీ లేమని చెబుతోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం.. ఏపీకి లేఖ రాసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై స్పందించకుంటే బోర్డులోనే తేల్చుకోవాలని భావిస్తోంది.