
సాక్షి,ఖమ్మం : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు నిరసన సెగ తగిలింది. ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లిన తుమ్మలకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు.
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. ప్రకాశ్ నగర్ వద్ద డేంజర్ లెవల్లో మున్నేరు ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం పట్టణంలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇళ్ల మధ్య నుంచి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరు వాగు గోదావరి నదిని తలపిస్తోంది. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో ఖమ్మం ప్రకాష నగర్ బ్రిడ్జ్‌పై తొమ్మిది మంది చిక్కుకున్నారు.
ఈ తరుణంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వరద పరిశీలించేందుకు తమ్మల నాగేశ్వర్‌రావు వెళ్లారు. ఆ సమయంలో తుమ్మలకు నిరసన సెగ తగిలింది. ప్రభుత్వానికి,తుమ్మలకు వ్యతిరేకంగా వరద పరిశీలిస్తున్న తుమ్మలను అడ్డుకున్నారు. ఉదయం 9 గంటల నుండి వరదల్లో చిక్కుకున్న 9 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించ లేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.