
కొచ్చి: ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో కొచ్చి బ్లూ స్పైకర్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కొచ్చి 10–15, 15–11, 11–15, 15–12, 15–12తో అహ్మదాబాద్ డిఫెండర్స్‌పై గెలుపొందింది. కొచ్చి తరఫున డేవిడ్ లీ 10, ప్రభాకరన్ 9, మను జోసెఫ్ 7 పాయింట్లతో రాణించగా, అహ్మదాబాద్ జట్టులో విక్టర్ సిసొవ్ (13), గురిందర్ సింగ్ (12) అదరగొట్టారు. నేడు జరిగే పోరులో చెన్నై స్పార్టన్స్‌తో బ్లాక్‌హాక్స్ హైదరాబాద్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment