PVL
-
టీడీపీ గూండాలతో లోకేశ్ బలప్రదర్శన: పీవీఎల్
-
కొచ్చి బ్లూ స్పైకర్స్ రెండో విజయం
కొచ్చి: ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో కొచ్చి బ్లూ స్పైకర్స్ వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో కొచ్చి 10–15, 15–11, 11–15, 15–12, 15–12తో అహ్మదాబాద్ డిఫెండర్స్పై గెలుపొందింది. కొచ్చి తరఫున డేవిడ్ లీ 10, ప్రభాకరన్ 9, మను జోసెఫ్ 7 పాయింట్లతో రాణించగా, అహ్మదాబాద్ జట్టులో విక్టర్ సిసొవ్ (13), గురిందర్ సింగ్ (12) అదరగొట్టారు. నేడు జరిగే పోరులో చెన్నై స్పార్టన్స్తో బ్లాక్హాక్స్ హైదరాబాద్ తలపడుతుంది. -
పీవీఎల్లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టిదే
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ప్రొ.వాలీబాల్ లీగ్(పీవీఎల్) తొలి ఎడిషన్లో హైదరాబాద్ ఫ్రాంచైజీ... ‘హైదరా బాద్ బ్లాక్ హాక్స్’ పేరిట పోటీ పడనుంది. శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన వేలంలో ఇందుకు సంబంధించిన ఆటగాళ్ల ఎంపిక పూర్తయింది. జట్టు సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ బ్లాక్ హాక్స్: అమిత్ కుమార్, రోహిత్ కుమార్, చిరాగ్, కార్సన్ క్లార్క్, సోనుకుమార్, గురమృత్పాల్ సింగ్, అస్వాల్ రాయ్, నంది యశ్వంత్ కుమార్, ముత్తుస్వామి, కమలేశ్ ఖతిక్, అన్గు ముత్తు.