కొచ్చిలో జైలర్‌ | Rajinikanth Lands In Kochi For Final Schedule Of Jailer | Sakshi
Sakshi News home page

కొచ్చిలో జైలర్‌

Published Mon, Mar 27 2023 6:04 AM | Last Updated on Mon, Mar 27 2023 6:04 AM

Rajinikanth Lands In Kochi For Final Schedule Of Jailer - Sakshi

కొచ్చికి మకాం మార్చారు ‘జైలర్‌’. రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జైలర్‌’. శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా కీలక పాత్రధారులుగా, ఓ అతిథి పాత్రలో మోహన్‌లాల్‌ నటిస్తున్నారు. ‘జైలర్‌’ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవల కొచ్చిలో ప్రారంభమైంది. రజనీకాంత్‌ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో పది రోజులు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుందని సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement