ఇళ్ల ధరలు పెరిగాయ్
• ఆర్‌బీఐ హౌసింగ్ సూచీ వెల్లడి
న్యూఢిల్లీ: ఇళ్ల ధరలు జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో 14 శాతం వరకూ పెరిగాయని ఆర్‌బీఐ ఇళ్ల ధరల సూచిక(హౌస్ ప్రైస్ ఇండెక్స్-హెచ్‌పీఐ) వెల్లడించింది. అయితే వార్షిక వృద్ధి రేటు మాత్రం మందగించిందని పేర్కొం ది. అత్యధిక ంగా ఢిల్లీలో ఇళ్ల స్థలాలు ధరలు 22 శాతం పెరిగాయని వివరించింది. కోచి మినహా మిగిలిన నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని పేర్కొంది. రియల్టీ రంగంలో డిమాండ్ మందగించినప్పటికీ, ఇళ్ల ధరలు పెరిగాయని పేర్కొంది.
ఢిల్లీ తర్వాత అధికంగా ఇళ్ల ధరలు పెరిగిన నగరంగా బెంగళూరు నిలిచిందని తెలిపింది. బెంగళూరులో 19శాతం ఇళ్ల ధరలు పెరిగాయని పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై(12 శాతం), లక్నో(11శాతం), ముంబై(11 శాతం), కాన్పూర్ (8 శాతం,) అహ్మదాబాద్(7 శాతం), కోల్‌కత(7 శాతం), జైపూర్(3 శాతం)లు నిలిచాయని వివరించింది.