
ద్వయం ‘దంచేసింది’
భారత క్రికెట్‌కు భవిష్యత్ ఆశాకిరణాలుగా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మరోసారి అదరగొట్టారు.
భారత క్రికెట్‌కు భవిష్యత్ ఆశాకిరణాలుగా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మరోసారి అదరగొట్టారు. చేజింగ్‌లో తనకు తిరుగులేదని కోహ్లి నిరూపించుకోగా అటు రోహిత్ తన భీకర ఫామ్‌ను కొనసాగించాడు. టెస్టుల్లోని పేలవ ప్రదర్శననే కొనసాగించిన వెస్టిండీస్ తొలి వన్డేలో ఘోరంగా ఓడిపోయింది.
కొచ్చి: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. టెస్టుల్లో వరుస సెంచరీలతో ఫామ్ చాటుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ (81 బంతుల్లో 72; 8 ఫోర్లు; 1 సిక్స్) మరోసారి మెరవగా... వన్‌డౌన్ ఆటగాడు విరాట్ కోహ్లి (84 బంతుల్లో 86; 9 ఫోర్లు; 2 సిక్స్) స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఫలితంగా స్థానిక నెహ్రూ స్టేడియంలో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను స్పిన్నర్లు రవీంద్ర జడేజా (3/37), సురేశ్ రైనా (3/34) కట్టడి చేశారు.
దీంతో బ్రేవోసేన 48.5 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయ్యింది. డారెన్ బ్రేవో (77 బంతుల్లో 59; 4 ఫోర్లు; 2 సిక్స్‌లు), ఓపెనర్ చార్లెస్ (34 బంతుల్లో 42; 2 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే రాణించారు. అశ్విన్‌కు రెండు, షమీకి ఓ వికెట్ దక్కింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 35.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 212 పరుగులు చేసి నెగ్గింది. హోల్డర్ రెండు వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం విరాట్ కోహ్లికి దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే 24న విశాఖపట్నంలో జరుగుతుంది.
విండీస్ తడబాటు
తొలి ఓవర్‌లోనే పర్యాటక జట్టుకు గట్టి ‘దెబ్బ’ తగిలింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో రెండో బంతికి లేని పరుగు కోసం ప్రయత్నించిన గేల్ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌కు చేరుకునేందుకు డైవ్ చేయడంతో గాయపడ్డాడు. అంతలోపే బంతిని అందుకున్న భువనేశ్వర్ వికెట్లను పడగొట్టాడు. అయితే మరో ఓపెనర్ చార్లెస్.. శామ్యూల్స్ (35 బంతుల్లో 24; 2 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. బాధ్యతాయుతంగా ఆడుతూ చెత్త బంతులను బాదుతూ పరుగులు సాధించారు. ఆరంభంలో వీరు కుదురుకునేందుకు ప్రాధాన్యమిచ్చినా అనంతరం ఎదురు దాడికి దిగారు. ముఖ్యంగా ఉనాద్కట్ రెండో ఓవర్‌లో ఇద్దరూ భారీ సిక్స్‌లు కొట్టారు.
అలాగే భువనేశ్వర్ బౌలింగ్‌లో చార్లెస్ వరుసగా మూడు ఫోర్లు బాదడంతో స్కోరులో వేగం పెరిగింది. జడేజా రాకతో చార్లెస్ జోరుకు బ్రేక్ పడింది. ఎడమ వైపు డైవ్ చేస్తూ చార్లెస్ కొట్టిన బంతిని పట్టుకోవడంతో రెండో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం సిమ్మన్స్ (40 బంతుల్లో 29; 1 ఫోర్; 1 సిక్స్)తో కలిసి డారెన్ బ్రేవో పోరాడాడు. ఎక్కువగా సింగిల్స్‌కు ప్రాధాన్యమిస్తూ స్కోరును ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. ఈ జోడి మధ్య నాలుగో వికెట్‌కు 65 పరుగులు జత చేరాయి. అశ్విన్, జడేజాల స్పిన్ మ్యాజిక్‌కు వెస్టిండీస్ చివరి ఆరు వికెట్లు 59 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.
కోహ్లి, రోహిత్ జోరు
స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత్ నాలుగో ఓవర్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (6 బంతుల్లో 5; 1 ఫోర్) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జోడి విండీస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంది. పూర్తిగా బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ఆరంభంలో రోహిత్ నిదానంగా ఆడినా కోహ్లి మాత్రం బౌండరీలతో దూసుకెళ్లాడు. అయితే స్యామీ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాది ఆ వెంటనే నరైన్ బౌలింగ్‌లో సిక్స్‌తో రోహిత్ కూడా టచ్‌లోకి వచ్చాడు.
ఈ ఇద్దరూ ఆడుతూ పాడుతూ స్కోరును పెంచారు. 53 బంతుల్లో రోహిత్ అర్ధ సెంచరీ పూర్తి చేయగా అటు కోహ్లి 58 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. అయితే వన్డేల్లో ఐదో శతకం కోసం దూసుకెళుతున్న రోహిత్ డీప్ మిడ్ వికెట్‌లో సిమ్మన్స్‌కు తేలికైన క్యాచ్ ఇచ్చాడు. దీంతో రెండో వికెట్‌కు 133 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. కోహ్లి వన్డేల్లో వేగంగా 5 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రికార్డు అందుకున్న వెంటనే... తర్వాతి బంతికే హోల్డర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివర్లో ధోని (7 బంతుల్లో 13 నాటౌట్; 3 ఫోర్లు), యువరాజ్ (29 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) మ్యాచ్‌ను ముగించారు.
1 వన్డేల్లో అత్యంత వేగంగా (114 ఇన్నింగ్స్) 5 వేల పరుగులను పూర్తి చేసిన రిచర్డ్స్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లి.
స్కోరు వివరాలు: వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (రనౌట్) 0; చార్లెస్ (సి అండ్ బి) జడేజా 42; శామ్యూల్స్ (బి) రైనా 24; డారెన్ బ్రేవో (బి) షమీ 59; సిమ్మన్స్ ఎల్బీడబ్ల్యు (బి) రైనా 29; దేవ్‌నారాయణ్ (బి) రైనా 4; డ్వ్రేన్ బ్రేవో (స్టంప్డ్) ధోని (బి) జడేజా 24; స్యామీ (సి) భువనేశ్వర్ (బి) జడేజా 5; హోల్డర్ నాటౌట్ 16; నరైన్ (సి అండ్ బి) అశ్విన్ 0; రాంపాల్ (సి) ధావన్ (బి) అశ్విన్ 1; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 1, వైడ్లు 6) 7; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 211.
వికెట్ల పతనం: 1-0; 2-65; 3-77; 4-142; 5-152; 6-183; 7-187; 8-204; 9-206; 10-211.
బౌలింగ్: భువనేశ్వర్ 5-0-26-0; ఉనాద్కట్ 6-0-39-0; షమీ 6-0-28-1; జడేజా 10-0-37-3; రైనా 10-1-34-3; అశ్విన్ 9.5-0-42-2; రోహిత్ 2-0-4-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సిమ్మన్స్ (బి) రాంపాల్ 72; ధావన్ (సి) చార్లెస్ (బి) హోల్డర్ 5; కోహ్లి (సి) నరైన్ (బి) హోల్డర్ 86; యువరాజ్ నాటౌట్ 16; రైనా (సి) హోల్డర్ (బి) నరైన్ 0; ధోని నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు (బైస్ 5, వైడ్లు 15) 20; మొత్తం (35.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 212.
వికెట్ల పతనం: 1-17; 2-150; 3-192; 4-194.
బౌలింగ్: రాంపాల్ 8-0-39-1; హోల్డర్ 8-0-48-2; స్యామీ 2-0-14-0; నరైన్ 10-1-57-1; దేవ్ నారాయణ్ 2-0-15-0; సిమ్మన్స్ 3-0-14-0; డ్వేన్ బ్రేవో 2.2-0-20-0.
సిరీస్‌కు గేల్ దూరం
వెస్టిండీస్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి వన్డేలో గాయపడిన గేల్ సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు తొలి ఓవర్ సింగిల్ కోసం ప్రయత్నిస్తూ డైవ్ చేస్తూ కిందపడడంతో గేల్ ఎడమ కాలి తొడ కండరాల్లో చీలిక ఏర్పడింది. దీంతో అతడిని స్ట్రెచర్‌పై మైదానం బయటకు తీసుకెళ్లారు. ఎంఆర్‌ఐ స్కాన్ ద్వారా గాయాన్ని పరీక్షించిన డాక్టర్లు రెండు నుంచి నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
‘రిచర్డ్స్‌రికార్డును సమం చేసినందుకు సంతోషంగా ఉంది. అయితే నేనెప్పుడూ రికార్డుల కోసం ఆడను. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. కొత్త నిబంధనలు బౌలర్లకు ఇబ్బందిగా ఉన్నా.. ఈ మ్యాచ్‌లో మావాళ్లు రాణించారు.’ - కోహ్లి