
కేరళ పోలీసులు మరో సెక్స్‌రాకెట్ గుట్టురట్టు చేశారు. కొచ్చి కేంద్రంగా జరుగుతున్న ఆన్‌లైన్ వ్యభిచార ముఠాకు చెక్‌పెట్టారు. ఈకేసులో 14 మందిని కొచ్చి పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఐదుగురు మహిళలు, నలుగురు హిజ్రాలు, ముగ్గురు విటులతో పాటు లాడ్జి మేనేజర్, వ్యభిచార గృహం నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఈ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ముఠా ఆన్‌లైన్ ద్వారా విటులకు గాలం వేస్తుంది. ఫోటోలను ఆన్‌లైన్‌లో పంపి రేటు కదుర్చుకుంటారు. అనంతరం రూమ్‌తో పాటు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. అయితే లాడ్జీలో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లాడ్జి రిసెప్సెన్‌లో అనుమతి లేకుండా అమ్ముతున్న మద్యం, తుపాకీలను స్వాధీన పరుచుకున్నారు. ఈసందర్భంగా ఎర్నాకులం ఏసీపీ లాల్‌జీ మాట్లాడుతూ అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. నిందితులను కోర్టులో హజరు పరుస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment