ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు రాజు డానియెల్ అలియాస్ ‘కెప్టెన్ రాజు’(68) కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ వంటి పలు భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన స్వయంగా రెండు మలయాళ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు.