
కొచ్చి: కొచ్చి విమానాశ్రయం నీట మునిగి రాకపోకలు నిలిచిపోవడంతో విమానాల్ని సోమవా రం నుంచి కొచ్చిలోని నౌకాదళ విమానాశ్రయానికి మళ్లించనున్నారు. పౌర విమానాలు నడి పేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెప్పారు. ఈనెల 26 వరకు కొచ్చి విమానాశ్రయాన్ని మూసే ఉంచాలని నిర్ణయించడం తెలిసిందే. అలయన్స్ ఎయిర్ విమానయాన సంస్థ ముందుగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.