
సోనియా గాంధీ
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సిపిఎంపై విరుచుకుపడ్డారు. కేరళ రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సదస్సులో ఆమె ప్రసంగించారు.
కొచ్చి: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సిపిఎంపై విరుచుకుపడ్డారు. కేరళ రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సదస్సులో ఆమె ప్రసంగించారు. అసంబద్ధ భావజాలంతో తమ లక్ష్యాలను సాధించుకోవడానికి సిపిఎం హింసావాదాన్ని అనుసరిస్తోందని మండిపడ్డారు. ఫలితాలివ్వని వాగ్దానాలు చేస్తున్న కాషాయం పార్టీ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అంతర్గత కుమ్ములాటలను పక్కనబెట్టి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పాటుపడాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. దేశంలో ఐక్యత కోసం కాంగ్రెస్ నిలబడుతున్న సమయంలో, ప్రధాన ప్రతిపక్షం మాత్రం ద్వేషభావాన్ని పెంపొందించి ప్రజల మధ్య విభజన తీసుకురావాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం లేకపోవడంతో పార్లమెంట్‌లో ఆమోదం పొందడంలేదంటూ విచారం వ్యక్తం చేశారు.