తణుకు: పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తణుకు వై జంక్షన్ వద్ద జరిపిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 10 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో 6 బైక్‌లు, 2 టాటాఏస్‌లు, ఓ కారు, ఓ ఐచర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్‌కు తరలించారు.