ముద్రగడపై లీగల్గా ప్రొసీడ్ అవుతాం: ఎస్పీ
కిర్లంపూడి: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై లీగల్గా ప్రొసీడ్ అవుతామని ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. కిర్లంపూడిలో గురువారం ఆయన మాట్లాడుతూ...ముద్రగడ ఆంక్షలు ఉల్లంఘించారన్నారు.
ఆయనపై 32 యాక్ట్ ప్రకారం రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అమలాపురంలో సెక్షన్ 202/216తో పాటు కిర్లంపూడిలో మరో కేసు నమోదు చేశామని..ఆయన అరెస్టుకు సహకరించడం లేదని ఎస్సీ చెప్పారు. సీఐడీ అధికారులు ముద్రగడతో మాట్లాడతారని చెప్పారు. జిల్లాలో ఎక్కడా దీక్షలు, ధర్నాలు చేయడానికి వీల్లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ముద్రగడ గురువారం ఉదయం తన నివాసంలో సతీమణితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని పురుగు మందు డబ్బా చేతపట్టుకుని హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.