వాషింగ్టన్: కొత్త ఏడాదిలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దూసుకుపోవాలని భావిస్తున్న దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నికలకు కేసులు ప్రతిబంధకం కాకుండా ఎంత ధీటుగా ఎదుర్కొన్నప్పటికీ ట్రంప్ స్పీడుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రాసిక్యూషన్ కూడా అంతే గట్టిగా కేసులు వాదిస్తోంది.
2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేందుకు యత్నించిన కేసుకు సంబంధించి తాజాగా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ బలమైన వాదనలు చేసింది. ట్రంప్‌కు క్రిమినల్ కేసుల నుంచి ఎలాంటి ప్రత్యేక రక్షణ ఉండదని కోర్టుకు తెలిపింది. తాను అధ్యకక్షుడిగా ఉన్నపుడు పాల్పడిన చర్యలకు క్రిమినల్ చట్టాలు వర్తించవని ట్రంప్ బలంగా వాదిస్తున్నారు. ట్రంప్ చేసిన ఈ వాదనను కొలంబియా కోర్టు ఇప్పటికే తోసిపుచ్చడంతో ఆయన అప్పీల్‌కు వెళ్లారు.
ఈ కేసులో జనవరి 9న కొలంబియా సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఇరుపక్షాల వాదనలు విననుంది. ఒకవేళ ట్రంప్ అప్పీల్‌ను కోర్టు తిరస్కరిస్తే ఈ కేసులో మార్చి నుంచి ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభిస్తుంది. అధ్యక్ష ఎన్నికల రేసులో దూసుకుపోవాలనుకుంటున్న ట్రంప్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. 2024 నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా జనవరి 15 నుంచి ప్రైమరీలు ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment