
బాలకృష్ణపై ప్రాసిక్యూషన్ నిలిపివేత
సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై 2009లో నరసరావుపేటలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌ను నిలిపేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీచేసింది.
నరసరావుపేట: సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై 2009లో నరసరావుపేటలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌ను నిలిపేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీచేసింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కోడెల శివప్రసాదరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు బాలకృష్ణ నరసరావుపేటకు వచ్చారు.
ఆ సమయంలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అయినప్పటికీ దానికి విరుద్ధంగా ర్యాలీ, సభ, సమావేశం నిర్వహించినందుకు గాను బాలకృష్ణతోపాటు ప్రస్తుత స్పీకర్ కోడెల, గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, కోడెల తనయుడు శివరామకృష్ణ, మరో 15మందిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో వీరిపై ప్రాసిక్యూషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాలమేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.ఆర్.అనూరాధ జీవో నంబరు 122ను జారీచేశారు.