సాక్షి, అమరావతి: వార్షిక బడ్జెట్‌లో ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కోవిడ్ అనంతరం ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది రాబోయే రోజులలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది. ఈవిషయంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంరక్షణ సంస్థలను ప్రాథమిక స్థాయి నుంచి అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ స్థాయికి మార్చడంతో పాటు సౌకర్యాల భౌతిక స్థాయిని పెంచడం మాత్రమే కాకుండా, అవసరమైన పరికరాలు, శిక్షణ పొందిన మానవ వనరులను సమకూర్చడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
జాతీయ ఆరోగ్య మిషన్ కింద 108 సేవలు, 104 సేవలు, కుటుంబ సంక్షేమం వంటి ప్రాధాన్యతా కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు, ముఖ్యమైన పథకాల కింద బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. వ్యాధులు రాకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా, ఆరోగ్య సంరక్షణ సేవలను పౌరుల ఇంటి వద్దకు కుటుంబ వైద్యుల కార్యక్రమం ద్వారా తీసుకువెళ్తోంది ప్రభుత్వం. అనారోగ్య సమయాలలో రోలుగు ప్రయాణించిల్సిన అవసరం లేకుండా, తదపరి సంరక్షణపై మెరుగైన పర్యవేక్షణ ఉందని ఈ కార్యక్రమం నిర్ధారిస్తుంది. సాధారణ ఓపీ, అంటు వ్యాధుల నిర్వహణ, ప్రసవానికి ముందు తర్వాత సంరక్షణకు, మంచాన ఉన్న రోగులకు ఇంటి వద్దకు వెళ్లి వైద్యులు సేవలు అందిస్తారు.
ఈ వైద్యులు 104-ఎంఎంయూ వాహనాల ద్వారా 15 రోజులకు ఒకసారి డాక్టర్ వెఎస్సార్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను(విలేజ్ హెల్త్ క్లినిక్) సందర్శిస్తారు. ఈ ఆరోగ్య కేంద్రాలలో రోగులకు 14 రకాల లేబొరేటరీ పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం కింద 54 లక్షల మందికిపై ప్రజలు తమ ఇంటి వద్ద వైద్య సేవలను పొందారు.
దాదాపు 1.41 కోట్ల కుటుంబాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణ విధానాలకు 2,446 నుంచి 3,255కు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెంచింది. మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలలో కూడా 716 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందో విధంగా ఈ పథకాన్ని విస్తరిచండం జరిగింది. డాక్టర్ వైఎస్సార్ ఆఱోగ్య ఆసరా కింద శస్త్రచికిత్స తర్వాత జీవనోపాధి నిమిత్తం సీఎం జగన్ ప్రభుత్వం నెలకు రూ.5,000 అందిస్తోంది
జగనన్న గోరుముద్ద..
పిల్లలకు రుచికరమైన, బలవర్ధకమైన, నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించే విధంగా ప్రభుత్వం రోజువారీ వంటకాల జాబితా మెరుగుపరచడం ద్వారా 2020 నుంచి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాడనికి ప్రభుత్వం రూ.1,000 కోట్లు అధికంగా ఖర్చు చేస్తోంది.
► మొత్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.15,882 కోట్లు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment