Family Welfare
-
International Womens Day 2024: ఆర్థిక స్వాతంత్య్రం అంటే?
స్త్రీలు సంపాదనపరులైతే ఏమవుతుంది? ఆర్థికంగా సమృద్ధి సాధిస్తే ఏమవుతుంది? తమ జీవితాలపై అధికారం వస్తుంది. కీలక నిర్ణయాలప్పుడు గొంతెత్తే ఆత్మవిశ్వాసం వస్తుంది. తమకు ఏ హక్కులు రక్షణ ఇస్తాయో ఎరుక కలుగుతుంది. స్త్రీ ఇవన్నీ కుటుంబ సంక్షేమానికే వెచ్చిస్తుంది. స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం ఇంటా, బయటా స్త్రీ, పురుషుల సమ భాగస్వామ్యాన్ని ప్రతిపాదిస్తుంది. కాని స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రానికి ఇంకా ఎంతో చైతన్యం కావాలి. స్త్రీలు సాధికారత పొందటం అంటే ఏమిటి? పరాధీనత నుంచి బయటపడటమే. అంటే? మరొకరు తనను పోషించే స్థితి నుంచి బయటపడటమే. తండ్రి, భర్త, కుమారుడి సంపాదన వల్ల మాత్రమే జీవితం గడుస్తూ ఉంటే కనుక ఆ పరాధీనత నుంచి బయట పడటం. అంటే బంధం నుంచి బయటపడటం కాదు. స్థితి నుంచి మాత్రమే. స్త్రీలు సాధికారత ఎప్పుడు పొందుతారంటే ఆర్థికంగా వారు స్వేచ్ఛ పొందినప్పుడు. స్త్రీలకు సామాజికంగా, కుటుంబపరంగా హక్కులు ఉంటాయి. అయితే ఆ హక్కులను దక్కించుకోవాలంటే వారికి ఆర్థిక ఆత్మవిశ్వాసం ఉండాలి. పుట్టుక నుంచే స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలనే భావన ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచే తీసివేయడం నేటికీ జరుగుతోంది. ‘ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టడానికి’ అనుకునే తల్లిదండ్రులు, భర్త సంపాదన వల్ల మాత్రమే ఆమె బతకాలనుకునే తల్లిదండ్రులు ఆమె చదువును నిర్లక్ష్యం చేయడం గ్రామీణ భారతంలో నేటికీ జరుగుతూనే ఉంది. ఆడపిల్లకు ఆస్తిపాస్తులు ఇచ్చినా చదువు వల్ల వచ్చే, ఆమెకై ఎంచుకునే ఉపాధి నుంచి వచ్చే సంపాదన కలిగించే ఆత్మవిశ్వాసం వేరు. స్త్రీలను ‘అదుపులో ఉంచడం’ అంటే వారిని ఆర్థిక వనరుల నుంచి దూరంగా పెట్టడమే. పోపుల డబ్బాలో కొద్దిపాటి చిల్లరకే ఆమె హక్కుదారు. దానివల్ల న్యూనతతో ఉండాలి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాల సమయంలో భర్త/తండ్రి/కుమారుడి మాట చెల్లుబాటు కావడానికి కారణం వారు ‘ఆర్థిక వనరులు కలిగి ఉండటం’. ‘రూపాయి సంపాదన లేని దానివి నువు కూడా మాట్లాడేదానివేనా’ అని స్త్రీలను పరోక్షంగా అనడం. అదే ఆమెకు సంపాదన ఉంటే నా వల్ల కూడా కుటుంబం నడుస్తోంది కాబట్టి కుటుంబ సంక్షేమం కోసం నా పాయింట్ చెప్పాల్సిందే అని అనగలదు. కుటుంబపరంగా, సామాజికంగా తన జీవితం ఏ విధంగా గడవాలని స్త్రీ ఆశిస్తుందో ఆ నిర్ణయాన్ని వెల్లడించే శక్తి ఆర్థిక స్వావలంబన వల్ల కలుగుతుంది. ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రం అవసరం. అందుకు చదువు ముఖ్య సాధనం. సాధికారత అంటే? స్త్రీలు సాధికారత పొందాలంటే వారి ఆకాంక్షలకు సమాజం ఆమోదం తెలపాల్సిందే. ఒక స్త్రీ అంట్రప్రెన్యూర్ కావాలనుకున్నా, పెద్ద పెద్ద సంస్థల్లో నాయకత్వ స్థానానికి ఎదగాలనుకున్నా, కాన్పు సమయంలో బ్రేక్ తీసుకుని నాలుగైదేళ్ల తర్వాత తిరిగి తన ఉద్యోగం చేయాలని అనుకున్నా, పెళ్లి తర్వాత పై చదువులకు వెళ్లాలనుకున్నా, గృహిణిగా ఉంటూ ఇంటిపట్టునే ఏదైనా పనిచేసి సంపాదించాలనుకున్నా వారికి అడ్డుగా నిలవకపోవడమే చేయవలసింది. ఒక అధ్యయనం ప్రకారం స్త్రీలు తమ సంపాదనలో 90 శాతం కుటుంబం కోసం ఖర్చు పెడతారు. పురుషులు నలభై–యాభై శాతం ఖర్చు పెడతారు. స్త్రీలు సాధికారత పొందడం అంటే తాము ఏం చేసినా పడి ఉంటుందనే భావన నుంచి పురుషులను బయట పడేయడం. ఎక్కువ తక్కువ లేని గౌరవ బంధాలను ప్రతిపాదించడం. ఆర్థిక అక్షరాస్యత స్త్రీలు సాధికారత, ఆర్థిక స్వావలంబన పొందాలంటే ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి స్త్రీలకు ఆర్థిక అక్షరాస్యతను కలిగించాలి. వ్యక్తిగత ఖర్చులు, కుటుంబ బడ్జెట్, పొదుపు, ఆదాయం తెచ్చే పెట్టుబడి... వీటి గురించి అవగాహన ఉండాలి. ‘మీ జీవితం మీ చేతుల్లో ఉండాలంటే’ మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలి... అందుకు ఏమి చేయాలో తెలుసుకోవాలి. సొంత ఆస్తి, స్వీయపేరు మీద పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, ఎమర్జన్సీ ఫండ్ కలిగి ఉండటం, డిజిటల్ పరిజ్ఞానం పొంది ఉండటం– అంటే ఆర్థిక లావాదేవీలు ఫోన్‌మీద, కంప్యూటర్ మీద చేయగలిగి వేగంగా పనులు నిర్వర్తించ గలగడం. కుటుంబ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అనుకుంటే కుటుంబంలో కీలకమైన వాటాదారైన స్త్రీ ఎంత ఆర్థిక సమృద్ధితో ఉంటే దేశ సమృద్ధి అంతగా పెరుగుతుంది. ఉమెన్స్ డే సందేశం అదే. -
ఆనాటి కాలం.. వడగాడ్పులు తీవ్రం
సాక్షి, అమరావతి: దేశంలో వడగాడ్పుల తీవ్రత, మరణాలపై గడిచిన తొమ్మిదేళ్లకు సంబంధించి ఇటీవల కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. 2015 నుంచి 2023 వరకు రాష్ట్రాల వారీగా లెక్కలను ఆ నివేదికలో వెల్లడించింది. సంవత్సరాల వారీగా చూస్తే 2015 నుంచి 2019 వరకు వడగాడ్పులకు ఆంధ్రప్రదేశ్‌లో 2,418 మంది మరణించారు. 2015లోనే అత్యధికంగా ఏపీలో 1,422 మంది మరణించినట్లు నివేదిక పేర్కొంది. ఇక 2020 నుంచి 2023 వరకు మన రాష్ట్రంలో వడగాడ్పులకు ఐదుగురు మరణించినట్లు నివేదిక స్పష్టం చేసింది. మన రాష్ట్రం తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. వాతావరణ మార్పు, మానవ ఆరోగ్యంపై దాని ప్రభావం తదితర అంశాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి వేసవి గాలులపై ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సూచనలు, సాంకేతిక సహకారం అందిస్తోంది. ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాలను పంపించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తోందని నివేదిక పేర్కొంది. వడగాడ్పులకు చికిత్స ద్వారా సంబంధిత మరణాలను తగ్గించడానికి మౌలిక సదుపాయాలను 28 రాష్ట్రాల్లో కల్పించినట్లు తెలిపింది. భారత వాతావరణ శాఖ హీట్ వేవ్ హెచ్చరికలను ముందస్తుగా జారీ చేస్తుందని, అందుకు అనుగుణంగా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా మరణాలను తగ్గించవచ్చని నివేదిక పేర్కొంది. -
AP Budget: వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: వార్షిక బడ్జెట్లో ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమానికి వైఎస్సార్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కోవిడ్ అనంతరం ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది రాబోయే రోజులలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది. ఈవిషయంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంరక్షణ సంస్థలను ప్రాథమిక స్థాయి నుంచి అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ స్థాయికి మార్చడంతో పాటు సౌకర్యాల భౌతిక స్థాయిని పెంచడం మాత్రమే కాకుండా, అవసరమైన పరికరాలు, శిక్షణ పొందిన మానవ వనరులను సమకూర్చడంలో ఎంతో ఉపయోగపడుతుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద 108 సేవలు, 104 సేవలు, కుటుంబ సంక్షేమం వంటి ప్రాధాన్యతా కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు, ముఖ్యమైన పథకాల కింద బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. వ్యాధులు రాకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా, ఆరోగ్య సంరక్షణ సేవలను పౌరుల ఇంటి వద్దకు కుటుంబ వైద్యుల కార్యక్రమం ద్వారా తీసుకువెళ్తోంది ప్రభుత్వం. అనారోగ్య సమయాలలో రోలుగు ప్రయాణించిల్సిన అవసరం లేకుండా, తదపరి సంరక్షణపై మెరుగైన పర్యవేక్షణ ఉందని ఈ కార్యక్రమం నిర్ధారిస్తుంది. సాధారణ ఓపీ, అంటు వ్యాధుల నిర్వహణ, ప్రసవానికి ముందు తర్వాత సంరక్షణకు, మంచాన ఉన్న రోగులకు ఇంటి వద్దకు వెళ్లి వైద్యులు సేవలు అందిస్తారు. ఈ వైద్యులు 104-ఎంఎంయూ వాహనాల ద్వారా 15 రోజులకు ఒకసారి డాక్టర్ వెఎస్సార్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను(విలేజ్ హెల్త్ క్లినిక్) సందర్శిస్తారు. ఈ ఆరోగ్య కేంద్రాలలో రోగులకు 14 రకాల లేబొరేటరీ పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం కింద 54 లక్షల మందికిపై ప్రజలు తమ ఇంటి వద్ద వైద్య సేవలను పొందారు. దాదాపు 1.41 కోట్ల కుటుంబాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణ విధానాలకు 2,446 నుంచి 3,255కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచింది. మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలలో కూడా 716 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందో విధంగా ఈ పథకాన్ని విస్తరిచండం జరిగింది. డాక్టర్ వైఎస్సార్ ఆఱోగ్య ఆసరా కింద శస్త్రచికిత్స తర్వాత జీవనోపాధి నిమిత్తం సీఎం జగన్ ప్రభుత్వం నెలకు రూ.5,000 అందిస్తోంది జగనన్న గోరుముద్ద.. పిల్లలకు రుచికరమైన, బలవర్ధకమైన, నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించే విధంగా ప్రభుత్వం రోజువారీ వంటకాల జాబితా మెరుగుపరచడం ద్వారా 2020 నుంచి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాడనికి ప్రభుత్వం రూ.1,000 కోట్లు అధికంగా ఖర్చు చేస్తోంది. ► మొత్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.15,882 కోట్లు కేటాయించింది. -
Andhra Pradesh: శుభకరమైన పాలన
జాన్ రాల్స్టన్ సౌల్ అన్న సామాజిక శాస్త్ర నిపుణుడు తన ‘ద కొలాప్స్ ఆఫ్ గ్లోబలిజం’ పుస్తకంలో ఉదాత్త నాయకులు భగవత్ సంకల్పంగా, ప్రకృతి నియమాను సారంగా ఆవిర్భవిస్తారని పేర్కొంటాడు. నాడు ఆరోగ్యం, ఆహారం, ఆవాసం, ఆచారం, అభ్యాసం, ఆర్జనం, ఆదర్శ దాంపత్యం, ఆదాయం అనే అష్టలక్ష్మిలకు తోడు ఆనంద మనే నవరత్నములను తొడిగిన గృహస్థాశ్రమ ధర్మాన్ని శ్రీరాముడు మానవ జాతికి అందించాడు. ప్రపంచ వ్యాప్తంగా నాగరికత వికాస క్రమానికి ఇది దోహదపడిందని పాశ్చాత్య శాస్త్రవేత్తలు సైతం దీన్ని ఆమోదిస్తున్నారు. వివేకానందుడు, గాంధీ మహాత్ముడి నుండి నేటి పాలకుల వరకు రామరాజ్యం ఒక సుందర స్వప్నం. ఆ దారిలోనే కుటుంబ సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఆకలికి మత విలువలు తెలియవంటాడు వివేకానందుడు. నాడు కలకత్తా ప్లేగు సమయంలో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి వేలాదిమందిని కాపాడాడు. ఆ ధీరుని స్ఫూర్తితో గాంధీ మహాత్ముడు వాలంటరీ వ్యవస్థతో సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వ హించాడు. నేడు అదే స్ఫూర్తితో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ వాలంటరీ వ్యవస్థ లక్షలాది మంది కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఆరోగ్య పరిరక్షణ రామరాజ్యంలో మౌలిక ధర్మం. అయోధ్యా రాజ్యంలో పెద్దలెవరూ తమ పిల్లలకు అంత్యక్రియలు జరిపిన దాఖలాలు లేవు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ లక్ష్య మిది. దానిని మరింత ముందుకు తీసుకొనిపోయి, ప్రపంచంలోని ఆరోగ్య రంగా నికి ఒక దిక్శూచిగా ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం పనిచేయడం వాస్తవం. వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా సంరక్షణ, ఆక్సిజన్ సరఫరాల లాంటి అత్యున్నత వైద్య ప్రమాణాలను పాటించిన ప్రభుత్వం ఇది. ప్రభుత్వ వైద్యా లయాలను దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వమిది. ఖరీదైన వైద్యసేవలు కూడా ఈ మహమ్మారి సమయంలో ప్రజలకు ఉచితంగా అందుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఇంగ్లండ్, యూరప్ సమాజాలు, అమెరికా లాంటి ధనిక దేశాలు ఆరోగ్య సంస్కరణలు లేకుండా కకావిక లమయ్యాయి. బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లేయర్ లాంటి గొప్ప నాయకుడు కూడా ఆరోగ్య సంస్కరణలో అనుకున్నంత సాధించలేకపోయానని తన జీవితచరిత్రలో అంతర్మథనం పొందాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య రాజ్యంలాగా తండ్రి చేపట్టిన ఆరోగ్య సంస్కరణలకు నిజరూపాన్ని ఇవ్వడం నేడు సత్య ప్రామాణికం. సగటు మనిషి జీవన ప్రమాణాలకు కారణమైన ఆరోగ్యం, ఆహారం, ఆవాసాలను సుస్థిరం చేస్తూనే, అభ్యాసంలో భాగంగా విద్యను సంతృప్తిగా భోదించాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం రామరాజ్యంలో భాగమే. సాంకేతిక విప్లవంతో కుగ్రామమైన ఈ ధరణిలో నాడు–నేడు పేరుతో పదిహేను వేల పాఠశాలలను సంస్కరించడం చరిత్ర మరువదగని అంశం. నాటి గురుకులాల వలె జగనన్న గోరుముద్దలతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ముందుచూపు రాజ్య ధర్మంలోని విశిష్టత. అధికార యంత్రాంగాన్ని సమాయత్తపరచి అల్పమైన విషయాలను కూడా వదలకుండా అత్యంత లాభం చేకూర్చేవాడే నిజమైన పాలకుడని శ్రీరాముడు ఉపదేశించాడు. అధర్మ వేషంలో ధర్మ పన్నాగాలు పన్నేవారి పట్ల అప్రమత్తతతో వుండాలనీ, జనులకు నిజం తెలియాలనీ భరతునికి రాముడు ఉపదేశిస్తాడు. ప్రజలకు సత్యాన్ని విడమరచి చెప్పేందుకు ధార్మిక సంస్థలను ప్రభు త్వానికి చేరువ చెయ్యాలి. నాడు రాజకీయాలకు అతీతంగా సమాజ సేవను మత సారంగా తెలియ జెప్పిన వివేకానందుడు మనకు ఆదర్శం కావాలి. ప్రభుత్వాన్ని బూచిగా చూపించి ప్రజలలో గందరగోళం సృష్టించడం అనైతికం. అతలాకుతలమవుతున్న మానవ జాతిలో ఆంధ్రజాతి సమున్నతంగా జీవించాలంటే జనే జనే, గృహే గృహే, గ్రామే గ్రామే, పురే పురే అంటూ ఆబాలగోపాల హృదయం సామాజిక చైతన్యంతో తొణికిసలాడాలి. మన రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి ప్రతి ఇంట గుడి గంటలు మ్రోగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంఘీభావం తెలపాలి. - ఎస్. వెంకట శర్మ వ్యాసకర్త ముఖ్య సమన్వయ అధికారి, ధార్మిక సంస్థలు, తిరుమల తిరుపతి దేవస్థానములు -
స్త్రీ సంక్షేమానికి పెద్దపీట
-
స్త్రీ సంక్షేమానికి పెద్దపీట
సాక్షి ప్రతినిధి, చెన్నై: కుటుంబ సంక్షేమానికి మహిళా సాధికారత కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో మహిళల పురోగతికి తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టిందని తెలిపారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత 70వ జయంతి సందర్భంగా మహిళా ఉద్యోగులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు అందించే పథకం ‘అమ్మ టూవీలర్’ను మోదీ శనివారం ఇక్కడ ప్రారంభించారు. ఐదుగురు లబ్ధిదారులకు తాళాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు అందించారు. గవర్నర్ బన్వరీలాల్, సీఎం పళనిస్వామి, డెప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2016 ఎన్నికల్లో జయలలిత ఈ పథకాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. దీని ప్రకారం.. స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్న ఉద్యోగినికి మొత్తం వ్యయంలో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇప్పటికే ఈ పథకానికి సుమారు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన జరుగుతోందని అధికార అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సీఎం, డిప్యూటీ సీఎంలు జయలలిత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అన్ని పథకాల్లో మహిళలకే ప్రాధాన్యం.. సబ్సిడీ స్కూటర్ల పథకం ప్రారంభించాక మోదీ మాట్లాడారు. కుటుంబంలో ఒక మహిళకు సాధికారత కల్పిస్తే మొత్తం కుటుంబానికి సాధికారత లభిస్తుందని అన్నారు. జయలలిత ఎక్కడున్నా ఈ కార్యక్రమాన్ని చూస్తే ఎంతో సంతోషిస్తారని అన్నారు. తమిళంలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ..‘తమిళనాడు రాష్ట్రానికి, తమిళ భాషకు, వారసత్వానికి శిరసు వంచి నమస్కరిస్తున్నా’ అని అన్నారు. జయకు నివాళులర్పిస్తూ ఆమెను ‘సెల్వి జయలలిత జీ’ అని సంబోధించారు. ‘మహిళా సాధికారతపై ఎక్కువగా దృష్టిసారిస్తూ అన్ని పథకాల్లోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళా సంక్షేమానికి కట్టుబడి ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పొడిగించాం. ముద్ర యోజన పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండానే 4.60 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశాం’ అని మోదీ పేర్కొన్నారు. డామన్ డయ్యూకు రూ. వేయి కోట్ల పథకాలు... కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యూలో రూ. వేయి కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను కూడా మోదీ ప్రారంభించారు. అలాగే అహ్మదాబాద్–డయ్యూ పట్టణాల మధ్య విమాన సేవలను ఆరంభించారు.మోదీ ప్రారంభించిన పథకాల్లో నీటి శుద్ధి ప్లాంట్, గ్యాస్ పైపులైన్, ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్, మునిసిపల్ మార్కెట్, పాదచారుల వంతెన తదితరాలున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)లో భాగంగా నిర్మించిన అంగన్వాడీ పాఠశాల భవనాలను కూడా మోదీ ఆరంభించారు. లబ్ధిదారుకు వాహనం ‘కీ’ అందజేస్తున్న మోదీ -
బాల్యం ‘తట్టు’కోవాలని!
రేపటి నుంచి ఎంఆర్ సార్వత్రిక టీకా - తెలంగాణలో 90 లక్షల మంది పిల్లలకు.. - ఆంధ్రప్రదేశ్‌లో 1.35 కోట్ల మందికి.. - 9 నెలల నుంచి 15 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ - ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 25 వరకు కార్యక్రమం సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు అతి పెద్ద సవాలుగా మారుతున్న తట్టు(మీజిల్స్), రుబెల్లా వ్యాధుల నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా వీటి అంతానికి ఎంఆర్ సార్వత్రిక టీకాను అమల్లోకి తెచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు ఉచితంగా ఎంఆర్ టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 9 నెలలు నిండిన పిల్లల నుంచి 15 ఏళ్ల లోపు వారందరికీ ఈ టీకా వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న 90,00,117 మంది పిల్లలకు టీకా వేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఈ టీకా వేయనున్నారు. బడి బయట ఉండే పిల్లలకు కూడా ఈ టీకా వేసేందుకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. తట్టు, రుబెల్లా వ్యాధుల నివారణకు గతంలో టీకాలు వేయించినా మరోసారి కూడా వేయాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఇతర ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు, గతంలో తట్టు, రుబెల్లా నివారణకు టీకా వేయించిన సమయంలో అలర్జీకి గురైన వారు ఈ టీకా వేయించుకోవద్దని పేర్కొంది. ఏటా 1.14 లక్షల మంది మృతి.. తట్టు వ్యాధి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1.14 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. మన దేశంలో ఏటా 49,200 మంది చనిపోతున్నారు. చిన్నారుల పాలిట ప్రమాదకరంగా మారుతున్న తట్టును 2020 లోపు మన దేశంలో పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం నిర్ణయించింది. రుబెల్లాతో కలిపి తట్టును నిర్మూలించేందుకు ఎంఆర్ సార్వత్రిక టీకాను ప్రవేశపెట్టింది. 1985 నుంచే ప్రైవేట్ రంగంలో తట్టు, గవద బిల్లలు, రుబెల్లా (ఎంఎంఆర్) టీకాలను పిల్లలకు ఇస్తున్నారు. ఇప్పుడు ఉచితంగా ఎంఆర్ టీకా వేయనున్నారు. 2018 లోపు దేశంలోని 40 కోట్ల మంది (95 శాతం) చిన్నారులకు ఈ టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 దశల్లో అన్ని రాష్ట్రాల్లోనూ టీకా కార్యక్రమాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. 2017 ఫిబ్రవరి 6న మొదటి దశ ఎంఆర్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 25 వరకు నిర్వహిస్తున్న రెండో దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, డయ్యూ–డామన్, దాద్రానగర్ హవేలీలోని 3.66 కోట్ల మంది పిల్లలకు ఎంఆర్ టీకా వేయనున్నారు. పుట్టే ప్రతి పిల్లలకు 12 నెలల వయసులో ఒకసారి, 24 నెలల వయసులో మరోసారి ఈ టీకా వేయించాల్సి ఉంటుంది. తట్టు లక్షణాలు.. ప్రమాదకరమైన అంటు వ్యాధి. వైరస్ ద్వారా సోకుతుంది. చిన్నారుల్లో వైకల్యాలకు, మరణాలకు కారణమవుతుంది. దగ్గడం, తుమ్మడం వల్ల వచ్చే తుంపర్లతో ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అతిసారం, న్యుమోనియా, నోటి పూత, చెవి ఇన్ఫెక్షన్, కళ్లు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. రుబెల్లా లక్షణాలు.. గర్భంతో ఉన్నప్పుడు రుబెల్లా ఇన్ఫెక్షన్ సోకితే గర్భస్రావం జరుగుతుంది. మృత శిశువు జన్మించే అవకాశముంది. నవజాత శిశువుల్లో అంధత్వం, వినికిడిలోపం, గుండె వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. రుబెల్లా వచ్చిన వారికి ఒళ్లంతా దద్దుర్లు కనిపిస్తాయి. రుబెల్లాతో ఉన్న చిన్నారులతో సన్నిహితంగా ఉండే వయోజనులకూ ఇది సోకుతుంది. ఇది ముఖ్యమైన టీకా తట్టు, రుబెల్లా టీకా చాలా ముఖ్యమైనది. చిన్న పిల్లల తల్లి దండ్రులు దీన్ని ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాలి. యూరప్‌లో ఇప్పుడు తట్టు ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎంఆర్ టీకాను రాష్ట్రంలో 90 లక్షల మంది పిల్లలకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆగస్టు 17 నుంచి మొదలవుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నా. – వాకాటి కరుణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
వైద్యారోగ్యశాఖ వైఫల్యాలకు పరాకాష్ట
-
ఏసీబీకి చిక్కిన కుటుంబ సంక్షేమ శాఖ ఏడీ
రూ. 17 వేల నగదు స్వాధీనం హైదరాబాద్: డిప్యుటేషన్‌కు సంబంధించిన ఉత్తర్వుల జారీకిగాను రూ.12 వేలు లంచం తీసుకుంటూ రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు సంచాల కులు (అడ్మిన్–1) ఎం.సంజీవరావు, అటెండర్, డ్రైవర్ మంగళవారం ఇక్కడ అవినీతి నిరోధకశాఖ అధికారుల కు చిక్కారు. వివరాలను సిటీ రేంజ్–1 అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ అశోక్‌కుమార్ వెల్లడించారు. వరంగల్ జిల్లా దామెర పీహెచ్సీ ఫార్మాసిస్టు శైలజ వరంగల్ జిల్లాలోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌కు డిప్యుటేషన్ ఇవ్వాలని కోరడంతో వైద్య, ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ ఎం.సంజీవరావు నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. శైలజకు డిప్యుటేషన్ మీద సెంట్రల్ డ్రగ్స్‌స్టోర్‌కు వేయాలని కమి టీ నిర్ణయించింది. ఉత్తర్వుల జారీకిగాను సంజీవరావు శైలజను రూ.12 వేలు డిమాండ్ చేశారు. దీనిపై శైలజ బంధువు రజనీకాంత్ ఈ నెల 16న ఏసీబీని ఆశ్రయించ డంతో అధికారులు సంజీవరావుపై నిఘా పెట్టారు. ఏడీ డ్రైవర్ తౌఫిక్ రూ.15 వేలు, అటెండర్ అంబర్‌బాబా మరో రూ.2 వేలు తీసుకుంటుం డగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, రాజేశ్, మంజుల పాల్గొన్నారు. -
‘హరీష్’ స్ఫూర్తి అజరామరం
= ప్రమాద బాధితులకు సాయం చేయండి = ముఖ్యమంత్రి సాంత్వన‘హరీష్ యోజన’ను ప్రారంభించిన సీఎం = ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు = తన కుమారుడి పేరుతో పథకం ప్రారంభించడం సంతోషదాయకం : హరీష్ తల్లి గీత బెంగళూరు : తాను చావు బతులకు మధ్య ఉన్నానని తెలిసి తన అవయవాలను మరొకరికి దానం చేయాలని చివరి కోరికగా అసమాన స్ఫూర్తి ప్రదర్శించిన ‘హరీష్’ పేరుతో పథకం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడి విధాన సౌధలో ముఖ్యమంత్రి సాంత్వన‘హరీష్ యోజన’ పథకాన్ని ప్రారంభించి మాట్లాడుతూ... హరీష్ మరణం దురదృష్టకరమైనా ఆయన స్ఫూర్తి అజరామరమన్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు మాకెందుకులే అంటూ ప్రజలు భావించకుండా తక్షణ సాయం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల సందర్భంలో బాధితులకు ఉపయుక్తంగా ఉండేలా రూపొందించిన ముఖ్యమంత్రి సాంత్వన‘హరీష్ యోజన’ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ పథకంలో ఉన్న ముఖ్యమంత్రి పేరును తీసేస్తే బాగుంటుందని ముందుగా సిద్ధరామయ్య రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సూచించారు. ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకు ప్రైవేటు ఆస్పత్రులు సైతం ముందుగా అవసరమైన చికిత్సను అందజేయాలని, డబ్బు గురించి ఆలోచించరాదని అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం విజయవంతంగా అమలు కావాలంటే సాధారణ ప్రజలు, ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు, వైద్యులు, పోలీసులు ఇలా అందరి సహకారం అవసరమన్నారు. ఈ పథకంలో భాగంగా ప్రమాద బాధితులకు 48 గంటల వరకు రూ. 25 వేల ఖర్చును ప్రభుత్వం భరించే దిశగా ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఇప్పటివరకు దేశంలో ఇలాంటి పథకం లేదని చెప్పారు. ఇలాంటి కార్యక్రమానికి రూపకల్పన చేసిన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు ఆయన అభినందనలు తెలియజేశారు. హరీష్ తల్లి గీతా మాట్లాడుతూ....‘నా కుమారుడికి కలిగిన పరిస్థితి మరే బిడ్డకు రాకూడదు. ఈ పథకానికి హరీష్ పేరు పెట్టడం సంతోషాన్నిచ్చింది. ప్రమాద బాధితులకు కొత్త ఊపిరి పోయడానికి ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. మంత్రులు యు.టి.ఖాదర్, శరణ్ ప్రకాష్ పాటిల్ పాల్గొన్నారు. -
వారానికి ఒక్కరోజే!
వారానికి ఒకరోజు.. అనగానే వారాంతపు సెలవు గురించే ప్రస్తావిస్తున్నామనుకుంటున్నారా!.. అలా అనుకోవడం సహజమే కానీ.. మనం ఇక్కడ చెప్పుకొనేది వారాంతపు సెలవు గురించి కాదండోయ్!!.. వారంలో ఏడు రోజులుంటే ఉద్యోగులు, వ్యాపారులు.. ఆరు రోజులు పని చేసి.. ఏడో రోజు సెలవు తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే.. కానీ ఒక జిల్లాస్థాయి కార్యాలయ అధికారి మాత్రం దీనికి పూర్తి రివర్స్‌లో పని చేస్తున్నారు. ఆయన పని చేసేది వారంలో ఒక్కరోజే.. మిగిలిన రోజులు ఆయన ఏం చేస్తున్నారో గానీ ఇదే అదనుగా కార్యాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మాజీ సైనికులు, వారి కుటుంబాలతో ఆడుకుంటున్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమాన్ని చూడాల్సిన కార్యాలయం పర్యవేక్షణ లేక గాడి తప్పుతోంది. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయానికి పూర్తిస్థాయి అధికారి లేకపోవడం, అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారి వారంలో ఒక్కరోజే కార్యాల యానికి వస్తుండటంతో పనులు పెండింగులో పడిపోవడమే కాకుం డా సిబ్బంది ఆడిందే ఆటగా వ్యవహారం సాగుతోంది. మాజీ సైనికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, రాయితీలకు సంబంధించి ఈ కార్యాలయమే ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారి పర్యవేక్షణ లోపించడంతో కార్యాలయ సిబ్బంది ఒక్కో సర్టిఫికెట్‌కు ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. మాజీ సైనికుడిగా నిర్థారించే గుర్తింపు కార్డు ఇవ్వాలంటే రూ.500 చెల్లించాల్సిందేనని పలువురు మాజీ సైనికులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకునేందుకు వెళ్లే వారి పట్ల సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రెచ్చిపోయి నోరుపారేసుకుంటున్నారు. బదిలీ.. ఆ వెంటనే అదనపు బాధ్యతలు పూర్తిస్థాయి అధికారి లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని మాజీ సైనికులు వాపోతున్నారు. గత కొంత కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. 2003 నుంచి ఆరేళ్లపాటు జిల్లా సైనిక సంక్షేమాధికారిగా పని చేసిన అధికారి 2009లో విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యారు. వెళ్లిన కొద్దిరోజులకే శ్రీకాకుళం జిల్లా కార్యాలయ ఇన్చార్జిగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) కూడా అంది పుచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి విజయనగరంలో విధులు ఎలా నిర్వర్తిస్తున్నారన్నది పక్కనపెడితే.. శ్రీకాకుళం కార్యాలయానికి మాత్రం వారంలో ఒక్కరోజే (మంగళవారం) వస్తున్నారు. ఈ విషయాన్ని సదరు అధికారే అంగీకరిస్తున్నారు. పెండింగులో ఫైళ్లు, ధ్రువపత్రాలు ప్రభుత్వ కార్యాలయాల్లో రోజూ విధులు నిర్వహిస్తున్నా ఫైళ్లు, పనులు పెండింగులో ఉండిపోతున్నాయి. అలాంటిది ఒక జిల్లాస్థాయి అధికారి వారానికి ఒకరోజు... నెలలో నాలుగు రోజులే విధులకు హాజరైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫైళ్లు పరిష్కారం కాక పెద్ద సంఖ్యలో పెండింగులో ఉండిపోతున్నాయి. ఇక వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు అధికారి సంతకానికి నోచుకోక ఫైళ్లలో మగ్గిపోతున్నాయి. దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. నిర్ణీత గడువులోగా ధ్రుపపత్రాలు అందక ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతున్నామని మాజీ సైనికులు, వారి కుటుంబాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ జాప్యాన్నే అనువుగా మలచుకుంటున్న సిబ్బంది పని తొందరగా జరగాలంటే చెయ్యి తడపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 4575 మంది మాజీ సైనికులు త్రివిద దళాల్లో(ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికులు, వితంతువులు జూలై 31 నాటికి జిల్లాలో 4575 మంది ఉన్నారు. వీరందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయానిదే. దేశ రక్షణలో ఆహారహం శ్రమించిన తమ పట్ల కార్యాలయ సిబ్బంది ప్రవరిస్తున్న తీరుపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మాజీ సైనికుల వివరాలు కేటగిరీ ఆర్మీ నేవీ ఎయిర్‌ఫోర్స్ మొత్తం మాజీ సైనికులు 3507 193 123 3823 వితంతువులు 717 20 15 752 నిజమే..కానీ..! వారానికి ఒక్కరోజు విధులకు హాజరవుతున్న మాట వాస్తవమే. నాకు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. అయితే దీని వల్ల రోజువారీ పనులకు ఇబ్బంది ఉండదు. తాహశీల్దార్ కార్యాలయాల మాదిరిగా మా కార్యాలయంలో సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి తిప్పం. క్షణాల్లో జారీ చేసేస్తాం. ఫైళ్లను కూడా పెండింగ్‌లో ఉంచం. వారం రోజుల ఫైళ్లు ఒకేసారి పరిష్కరించేస్తాం. సిబ్బంది చేతివాటం గురించి నాకు తెలీదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తా. - వి.వి.రాజారావు, మాజీ సైనిక సంక్షేమాధికారి -
51 లక్షల మంది ఆరోగ్యానికి మీరే రక్ష
కాకినాడ క్రైం :‘ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది. అనుకుంటే మీరేదైనా చేయగలరు. మీరు మారాలి’ అంటూ వైద్యులకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రభుత్వాస్పత్రుల వైద్యులకు సూచించారు. శనివారం కాకినాడలో ఆయన కలెక్టరేట్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, జీజీహెచ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోనసీమ, మెట్ట, మైదాన, ఏజెన్సీ వంటి ప్రాంతాలతో వైవిధ్యభరితమైన వాతావరణం కలిగిన జిల్లాలోని 51 లక్షల మంది ఆరోగ్యానికి వైద్యులే బాధ్యులన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు పూర్తి బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఆస్పత్రుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జబ్బు పడి ఆస్పత్రికి వస్తే కొత్త రోగాల బారిన పడతామనే భావన ప్రజల్లో నెలకొందన్నారు. డ్యూటీ వేళలో విధిగా ఆస్పత్రిలోనే ఉండాలని, నర్సింగ్ హోంలకు వెళ్లవద్దని చెప్పారు. జిల్లాలో బయోమెట్రిక్ విధానం అమలవుతున్నందున ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని చెప్పారు. బాధ్యతారాహిత్యాన్ని సహించబోమని హెచ్చరించారు. ‘సమన్వయం’ ఎక్కడ..? జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్), జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారుల మధ్య సమన్వయం కొరవడిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. డీసీహెచ్ఎస్ ఇచ్చిన నివేదికలకు, వైద్యాధికారులు చెప్పే వివరాలకు పొంతన లేదన్నారు. ఆస్పత్రి ప్రసవాలు, మాతా శిశు మరణాలు, ఎస్ఎన్సీయూ, ఇమ్యూనైజేషన్, జవహర్ బాల ఆరోగ్య రక్ష, టీబీ, హెచ్ఐవీ/ఎయిడ్స్, అంధత్వ నివారణ, స్కూల్ హెల్త్ తదితర కార్యక్రమాలు అమలవుతున్న తీరుపై ఆరా తీశారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఎంఈ డాక్టర్ జి.శాంతారావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.పవన్ కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు ఆదర్శం కావడం బాధాకరం.. తాను రంగరాయ వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించానని, అప్పట్లో ఆ కళాశాలకు ధీటుగా ఉండాలని కార్పొరేట్ ఆస్పత్రుల యజమానులు ఆకాంక్షించేవారని, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయని మంత్రి కామినేని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా జీజీహెచ్‌ను తీర్చిదిద్దాలనుకోవడం బాధాకరమన్నారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో రూ.20 కోట్లతో ఏర్పాటు చేయనున్న మెటర్నిటీ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) బ్లాకుకు మంత్రి శంకుస్థాపన చేశారు. కాకినాడ సీ పోర్ట్సు లిమిటెడ్ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఐసీయూని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి మరిన్ని నిధులిచ్చి పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సహకరించాలన్నారు. సీఎస్ఆర్ నిధులను పుష్కలంగా అందిస్తే మెరుగైన సౌకర్యాలు జీజీహెచ్‌లోనే సమకూరుతాయన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకట బుద్ధ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎంపీ తోట నరసింహం, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి, మెన్స్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ కె.లకో్ష్మజీనాయుడు, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, సీ పోర్ట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కామినేనిని పలువురు సత్కరించారు. ఆయన జీజీహెచ్, ఆర్ఎంసీలను పరిశీలించారు. జిల్లా ఇన్చార్జిగా సౌరభ్ జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యక్రమాల సక్రమ అమలుకు ఐఏఎస్ అధికారులను ఇన్చార్జిలుగా నియమించామని మంత్రి కామినేని వెల్లడించారు. జిల్లాకు సౌరభ్‌ను ఇన్చార్జిగా నియమించామన్నారు. ఆయన నెల నెలా జిల్లాకు వచ్చి అధికారులతో సమీక్షించి తనకు నివేదికలు అందజేస్తారన్నారు. మాతా శిశుమరణాలు పెరిగిపోతున్న దృష్ట్యా ప్రజలకు మంచి చికిత్స, ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ఇన్చార్జిలను నియమించామన్నారు. -
ఏటా లక్ష్యాలకు టాటా!
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: విపరీతంగా పెరిగిపోతున్న జనాభాను నియంత్రించి, కుటుంబ సంక్షేమానికి ప్రభుత్వం కోట్లాదిరూపాయలు వెచ్చిస్తోంది. పేదరిక నిర్మూలన, పథకాలన్నీ అర్హులందరికీ అందాలంటే కుటుంబ సంక్షేమం అమలు తప్పని సరి. ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించిన ప్రభుత్వం ప్రతి ఏడాదీ లక్ష్యాలను నిర్ధేశించి, నిధులు విడుదల చేస్తోంది. అయితే జిల్లా అధికారులకు ఇవేవీ పట్టడంలేదు. ఏటా ఏదో ఒక సాకు చెప్పి లక్ష్యాలను అలక్ష్యం చేస్తున్నారు. కుటుంబ సంక్షే మ శస్త్ర చికిత్సల లక్ష్యానికి గండి కొడుతోంది. ఏడు నెలల వ్యవధికి నిర్దేశించిన లక్ష్యంలో సగం మందికి మాత్రమే వారు ఇప్పటివరకు శస్త్ర చికిత్సలు చేయగలిగారు. అయితే అధికారులకు ఇదేమీ కొత్తకాదు. ప్రతి ఏడాదీ ఇదే తంతు. ఈ ఏడాదైనా వైద్యారోగ్యశాఖాధికారులు కొత్తగా ఏమైనా చేస్తారని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. జనాభా నియంత్రణలో అతి ప్రధానమైన కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల లక్ష్యాన్ని సాధించక పోవడంతో వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు నాటికి కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల లక్ష్యం 10,500 కాగా కేవలం 5,670 శస్త్రచికిత్సలు మాత్రమే చేశారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి లక్ష్యం 18 వేలుగా నిర్ధారించారు. అయితే దీనికి ఇంకా ఐదు నెలలు మాత్రమే గడువుంది. ఈలోగా దాదాపు 13వేల శస్త్ర చికిత్సలు చేయాలి. అధికారులు పనితీరు తెలిసిన వారు ఇప్పటికే దీనిపై పెదవి విరిచేస్తున్నారు. ఏడు నెలల వ్యవధిలో ఐదు వేల శస్త్రచిక్సితలు చేసిన వారు ఐదు నెలల వ్యవధిలో 13 వేల శస్త్రచికిత్సలు నిర్వహించడం సాధ్యపడేపని కాదని కొట్టి పడేస్తున్నారు. ఏటా విఫలమే... గత ఏడాది అధికారులకు 21 వేల శస్త్ర చికిత్సలు లక్ష్యంగా నిర్ధారించగా 19వేల వరకు చేశారు. అయితే శతశాతం పూర్తి చేసిన సందర్భాలు మాత్రం లేవనే చెప్పాలి. ఇలా ప్రతి ఏడాది అధికారులు లక్ష్యాన్ని సాధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సకాలంలో ఆపరేషన్లు చేయకపోవడం, ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం వల్ల మహిళలు ఈ శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి ముందుకురావడం లేదని సమాచారం