పబ్లిక్ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలను భాగస్వాములను చేస్తాం
శిక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సూచన
బడ్జెట్‌పై పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రజెంటేషన్
సాక్షి, అమరావతి: బడ్జెట్‌పైన, బడ్జెట్ సమావేశాలపైన అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలని అన్నారు. పబ్లిక్ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలనూ భాగస్వాములను చేస్తామని చెప్పారు. వెలగపూడి అసెంబ్లీ కమిటీ హాలులో మంగళవారం ఎన్డీఏ ఎమ్మెల్యేలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో ఒకే అంశంపై ఎంత సమయమైనా చర్చించేవాళ్లమని, ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి క్రమంగా తగ్గుతోందని చెప్పారు.
కేంద్ర బడ్జెట్‌లో కూడా నిధుల కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. సభలో ప్రతిపక్షం లేదని అనుకోవద్దని, వాళ్లకు బాధ్యత లేదని అన్నారు. అసెంబ్లీకి తాము పంపిన ప్రతినిధి తమ కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారని చెప్పారు. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు స్వాగతించరని తెలిపారు. స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు అసెంబ్లీ రూల్స్ తెలియాలని చెప్పారు. అనంతరం బడ్జెట్‌పై పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం
ఆ తర్వాత సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. 150 రోజుల పాలనలో చాలా నిర్ణయాలు తీసుకున్నాని చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యేలు హుందాగా ఉండాలని, వారి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపైన చర్చించాలని సూచించారు. ఈ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు, ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment